Telugu Global
Others

చీపుర్లకు పట్టిన దుమ్ము దులపండి!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజాభాగస్వామ్యంతో చేపట్టిన మహోద్యమం స్వచ్ఛ్ భారత్ అభియాన్. గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వయంగా రోడ్లు ఊడ్చి ప్రారంభించారు. మోడీ నినాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమ కెరటంలా మారి బలంగా వినిస్తూనే ఉంది. కేవలం వారానికి రెండు గంటలు.. సంవత్సరానికి 100గంటలు మీ పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి కేటాయించండి అంటారు మన ప్రధాని. అలా చేయడం వల్ల […]

చీపుర్లకు పట్టిన దుమ్ము దులపండి!
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజాభాగస్వామ్యంతో చేపట్టిన మహోద్యమం స్వచ్ఛ్ భారత్ అభియాన్. గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వయంగా రోడ్లు ఊడ్చి ప్రారంభించారు. మోడీ నినాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమ కెరటంలా మారి బలంగా వినిస్తూనే ఉంది. కేవలం వారానికి రెండు గంటలు.. సంవత్సరానికి 100గంటలు మీ పరిసరాలను శుభ్రం చేసుకోవడానికి కేటాయించండి అంటారు మన ప్రధాని. అలా చేయడం వల్ల 2019లో మహాత్ముడి 150 జయంతి సందర్భంగా స్వచ్ఛమైన భారతదేశంగా చూడాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్యం కోసం నిర్మల్ భారత్ అభియాన్ పేరుతో యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలుపెట్టింది. 2022 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉన్న‌ దేశంగా మార్చాలన్నదే దీని లక్ష్యం.కానీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ఈ కార్యక్రమానికి మరిన్ని హంగులు జోడించి స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌గా మార్చారు. ఇందులో కార్పొరేట్‌ ప్రముఖులు, సినీనటులు, కళాకారులు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేస్తూ పథకానికి భారీ ప్రచారం కల్పించారు మోడీ. ప్రజల్లోనూ అవగాహన పెంచారు. పారిశుధ్యం అవసరాన్ని గుర్తించేలా చేశారు.
ఈ కార్యక్రమం ప్రారంభమైన కొత్తలో రాజకీయ నాయకుల నుంచి కార్సొరేట్ ప్రముఖుల వరకు.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు హడావుడి చేశారు. కానీ రానురాను పూర్తిగా మర్చిపోయారు. ఏడాది తర్వాత తిరిగి చూసుకుంటే.. గత ఏడాది శుభ్రం చేసిన చీపుర్లకే దుమ్మ పట్టింది. అంటే అప్పుడు ఊడ్చిన చీపుర్లు మరోసారి వాడలేదన్నట్టు తయారైంది. దేశ ప్రయోజనాలు, ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది.
కేవలం ఫోటోలకు ఫోజులు.. సోషల్‌ మీడియాలో పోస్టింగుల వల్ల స్వచ్చ్‌భారత్‌ సాధ్యం కాదు. ప్రతిఒక్కరూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. పదమందితో కలిసి అడుగు వేద్దాం అని భావించినపుడే పరిశ్రుభమైన భారత్ ను చూస్తాం. గాంధీజీ 150వ జయంతి నాటికి అనుకున్న లక్ష్యం సాధించగలుగుతాం.
First Published:  1 Oct 2015 9:22 PM GMT
Next Story