అది బీఫ్ కాదు మటన్....
దీపం కిందే చీకిటి రాజ్యమేలుతుంది. కుల శక్తులు రాజ్యమేలుతున్న రాష్ట్రంలో మత శక్తులు విజృంభిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీకి 45 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఉత్తరప్రదేశ్ పరిధిలోని ఒక గ్రామంలో ఆవు మాంసం తింటున్నారన్న ఆరోపణతో ఒక 50 ఏళ్ళ వ్యక్తిని మతోన్మాద శక్తులు పొట్టన పెట్టుకున్న సంఘటన దేశమంతా సంచలనం రేపింది. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు దీనిపై ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నేతల మధ్య ఆవేశకావేశాలు […]
దీపం కిందే చీకిటి రాజ్యమేలుతుంది. కుల శక్తులు రాజ్యమేలుతున్న రాష్ట్రంలో మత శక్తులు విజృంభిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీకి 45 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఉత్తరప్రదేశ్ పరిధిలోని ఒక గ్రామంలో ఆవు మాంసం తింటున్నారన్న ఆరోపణతో ఒక 50 ఏళ్ళ వ్యక్తిని మతోన్మాద శక్తులు పొట్టన పెట్టుకున్న సంఘటన దేశమంతా సంచలనం రేపింది. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు దీనిపై ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నేతల మధ్య ఆవేశకావేశాలు పెల్లుబుకుతున్న సమయంలోనే దీనకంతటికి కారణంగా భావిస్తున్న స్థానిక గుడి పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజారి ప్రకటనే కారణమని స్థానికులు భావిస్తున్నారు. అయితే తాను ఎటువంటి ప్రకటన చేయలేదని తన చేతిలో మైక్ ఎవరో తీసుకుని ఆ ప్రకటన చేశారని పూజారి చెబుతున్నాడు. రెండొందల మంది ఈ దాడికి పాల్పడినట్లు చెబుతుండగా…ఇప్పటి వరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే స్థానిక పోలీసుల మీద తనకు నమ్మకం లేదని సీబీఐ చేత విచారణ జరిపించాలని హత్యకు గురైన అఖ్‌లాఖ్ భార్య కోరుతున్నారు. కేవలం ఆవు మాంసం తిన్నారన్న ఆరోపణతో, అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేయడాన్ని దేశమంతా ఖండిస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఘటనపై నివేదిక పంపాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆవు మాంసం తినడం యూపీలో నిషేధం కాదు. పైగా హత్యకు గురైన వ్యక్తి ఇంటిలో ఉన్నది కూడా ఆవు మాంసం కాదు మేక మాంసమే అని తేలింది. కేవలం అనుమానంతో మతోన్మాద పిశాచాలు చేసిన దారుణానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇంట్లో ఉన్నది మేక మాంసమే అని తేలింది గనుక చనిపోయిన మా నాన్నను బ్రతికిస్తారా అంటూ అతని కుమార్తె వేసిన ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు?