Telugu Global
National

బాపూజీకి ఘనంగా జాతి నివాళులు

మహాత్మాగాంధీ 147వ జయంతిని జాతి ఘనంగా స్మరించుకుంది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారి, ప్రధానమంత్రి నరేంద్రమోడి, వెంకయ్యనాయుడుతోపాటు అనేకమంది కేంద్ర మంత్రులు బాపూకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో రాష్ట్రపతి, ప్రధానితోపాటు అందరూ పాల్గొన్నారు.  ఏపీ తెలంగాణలో కూడా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు బాపూజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఖద్దరు వాడకాన్ని […]

బాపూజీకి ఘనంగా జాతి నివాళులు
X

మహాత్మాగాంధీ 147వ జయంతిని జాతి ఘనంగా స్మరించుకుంది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారి, ప్రధానమంత్రి నరేంద్రమోడి, వెంకయ్యనాయుడుతోపాటు అనేకమంది కేంద్ర మంత్రులు బాపూకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో రాష్ట్రపతి, ప్రధానితోపాటు అందరూ పాల్గొన్నారు.
ఏపీ తెలంగాణలో కూడా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు బాపూజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఖద్దరు వాడకాన్ని పెంచి గాంధీ ఆశయాలను అమలులోకి తీసుకువస్తామని ప్రకటించారు. శాంతి దూతగా ఆయన ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్డులో ఘనంగా గాంధీ జయంతి, ఖాదీ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నాలుగున్నర కిలోమీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ నాలుగున్నర కిలోమీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించడంలో పలు కాలేజీల విద్యార్థులు హాజరయ్యారు.కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌, చింతల్‌ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో బావూ ఘాట్‌ వద్ద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారావు తదితరులు ఘనంగా బాపూజీకి నివాళులర్పించారు. నాగార్జునసాగర్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకుడు కె.జానారెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

First Published:  2 Oct 2015 4:45 AM IST
Next Story