మానసిక ఒత్తిడి తగ్గించుకోండిలా..!
మన శరీరంలోని హార్మోనులు సాధారణమైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంగా పనిచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి తాత్కాలికమైనదైతే పరవాలేదు కానీ అది నిరంతర ప్రక్రియలా మారితే అది శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హానిచేస్తుంది. అయితే ఒత్తిడి తగ్గించుకోవడమనేది మనచేతిలోనే ఉంది. అందుకోసం కొన్ని చిట్కాలను చూద్దాం.. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలు తగ్గించాలి. పాలలోగానీ, నిమ్మరసంలో గానీ తేనెను కలుపుకుని తాగితే చాలా ఉపశమనం లభిస్తుంది. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. […]
మన శరీరంలోని హార్మోనులు సాధారణమైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంగా పనిచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి తాత్కాలికమైనదైతే పరవాలేదు కానీ అది నిరంతర ప్రక్రియలా మారితే అది శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హానిచేస్తుంది. అయితే ఒత్తిడి తగ్గించుకోవడమనేది మనచేతిలోనే ఉంది. అందుకోసం కొన్ని చిట్కాలను చూద్దాం.. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలు తగ్గించాలి. పాలలోగానీ, నిమ్మరసంలో గానీ తేనెను కలుపుకుని తాగితే చాలా ఉపశమనం లభిస్తుంది. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగ, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఒత్తిడిని జయించడానికి చాలా ఉపకరిస్తాయి. వీటితో పాటు పాజిటివ్‌గా ఆలోచించడం, ప్రకృతితో సాన్నిహిత్యం, మొక్కలు నాటడం, వాటి ఎదుగుదలను ప్రతిరోజూ పరిశీలించడం, ఆక్వేరియంలో చేపల కదలికలను పరిశీలించడం వంటివి కూడా ఒత్తడిని తొలగించడానికి ఉపకరిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.