"పెద్దలు జానారెడ్డి గారే" జానారెడ్డి వీక్‌నెస్!
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నుంచి గానీ, మంత్రుల నోటి నుంచి గానీ ”పెద్దలు జానారెడ్డి” అన్న పదం వస్తే చాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉలిక్కిపడుతున్నారట. ”పెద్దలు జానారెడ్డి” అన్న పదం జానారెడ్డి పాలిట వీక్‌లెస్‌లా తయారైందని వాపోతున్నారు. అధికార పక్షంపైకి జానారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడే ప్రయత్నం చేసిన ప్రతిసారి కేసీఆర్ గానీ, హరీష్‌రావుగానీ వెంటనే లేచి ” జానారెడ్డి గారు మీరు పెద్దలు, మీకు తెలియనిదేమీ కాదు… మీరే అలా అంటే ఎలా” అంటూ మోహమాటపెడుతున్నారని కాంగ్రెస్ […]
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నుంచి గానీ, మంత్రుల నోటి నుంచి గానీ ”పెద్దలు జానారెడ్డి” అన్న పదం వస్తే చాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉలిక్కిపడుతున్నారట. ”పెద్దలు జానారెడ్డి” అన్న పదం జానారెడ్డి పాలిట వీక్‌లెస్‌లా తయారైందని వాపోతున్నారు. అధికార పక్షంపైకి జానారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడే ప్రయత్నం చేసిన ప్రతిసారి కేసీఆర్ గానీ, హరీష్‌రావుగానీ వెంటనే లేచి ” జానారెడ్డి గారు మీరు పెద్దలు, మీకు తెలియనిదేమీ కాదు… మీరే అలా అంటే ఎలా” అంటూ మోహమాటపెడుతున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ”పెద్దలు జానారెడ్డి” అనగానే తమ నేత కూడా ఒక్కసారిగా కూల్ అయిపోతున్నారని వాపోతున్నారు.
చూడ్డానికి ఈ వ్యవహారం సిల్లీగా ఉన్నా దాని వల్లపార్టీకి జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదని అభిప్రాయపడుతున్నారు. సభలో జానారెడ్డిని సీఎల్పీ నేతగా కాకుండా ఓ పెద్దమనిషిలా తయారు చేసి అధికారపక్షం వాడుకుంటోందంటున్నారు. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం,ఇతర పక్షాలు సభకు అడ్డుపడిన సమయంలోనూ ”జానారెడ్డి గారు పెద్దలు మీరైనా వారికి చెప్పండి” అంటూ అధికారపక్షం చేతికి మట్టి అంటకుండా జానారెడ్డిని వాడుకుంటోందని రుసరుసలాడుతున్నారు.
బుధవారం సభలో జరిగిన ఒక సంఘటనను వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రైతు సమస్యలపై కేసీఆర్ మాట్లాడుతూ ఓ సందర్భంతో ”పెద్దలు జానారెడ్డి” అని సంబోధించారు. దీంతో ఒక్కసారిగా కొందరు సీనియర్ నేతలు మినహా అధికార, మిగిలిన విపక్ష సభ్యులంతా ఘెల్లున నవ్వారు. వెంటనే కేసీఆర్ ”ఎందుకయ్యా నవ్వుతున్నారు” అంటూ కోపగించుకున్నారు. అంటే దీని బట్టి ”పెద్దలు జానారెడ్డి” అన్న పదాన్ని అధికార పక్షం ఎలా , ఎందుకు వాడుకుంటోందని సభలోని అన్ని పక్షాలకు అర్థమైపోయిందని అందుకే నవ్వుకున్నారని కాంగ్రెస్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ”పెద్దలు జానారెడ్డి” అన్న పదాన్ని అధికార పక్షం ఓ బలహీనతగా భావిస్తోందన్న విషయాన్ని జానారెడ్డి అర్థం చేసుకుని పార్టీ కోసం తుది వరకు గట్టిగానే మాట్లాడాలని కోరుతున్నారు. అయితే అసెంబ్లీలో ఎలాంటి గొడవలు లేకుండా హుందాగా నడవడంలో జానారెడ్డి పాత్రను అందరు ప్రశంసిస్తున్నారు.