ఐటీ రిటర్న్స్ ఇచ్చేందుకు ఈ నెల 31వరకూ గడువు
ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేందుకు మరోసారి ఆదాయపన్నుశాఖ గడువు పెంచింది. 2015-16 సంవత్సరానికి ఈ ఫిల్లింగ్ రిటర్న్స్‌ను ఈ నెల 31 వరకూ పంపించవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. సెక్షన్ 44 ఏబీ కింద ఆదాయం పన్ను వివరాలను పంపించేందుకు గతంలో విధించిన గడువులను వివిధ కారణాలతో పొడిగించారు. తాజాగా సెప్టెంబర్ 30తో ముగిసిన గడువును అక్టోబర్ 31 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గడువులోగా ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేందుకు తమకున్న ఇబ్బందులు, అభ్యంతరాలతో […]
ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేందుకు మరోసారి ఆదాయపన్నుశాఖ గడువు పెంచింది. 2015-16 సంవత్సరానికి ఈ ఫిల్లింగ్ రిటర్న్స్‌ను ఈ నెల 31 వరకూ పంపించవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. సెక్షన్ 44 ఏబీ కింద ఆదాయం పన్ను వివరాలను పంపించేందుకు గతంలో విధించిన గడువులను వివిధ కారణాలతో పొడిగించారు. తాజాగా సెప్టెంబర్ 30తో ముగిసిన గడువును అక్టోబర్ 31 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గడువులోగా ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేందుకు తమకున్న ఇబ్బందులు, అభ్యంతరాలతో కూడిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అక్టోబర్ 31 వరకూ గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.