Telugu Global
Others

కొత్త రేషన్‌కార్డులకు హైసెక్యూరిటీ ఫీచర్స్‌

కొత్తగా జారీ చేయనున్న రేషన్‌కార్డు (ఆహార భద్రత) కార్డులకు అత్యంత భద్రతా ప్రమాణాలను (హై సెక్యూరిటీ ఫీచ ర్స్) జోడించి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చినగడానికి వీలు లేకుండా, ఒకవేళ నీటిలో గానీ, నిప్పులో పడిన గానీ చెడిపోకుండా హై డెన్సిటీ పాలిథీన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించి కార్డులను తయారు చేయాలని నిర్ణయించారు. మూడు సెక్యూరిటీ అంశాలతో రూపొందించిన ఐక్యూఆర్ కోడ్‌తో కూడిన ముద్రను కార్డుపై ఉపయోగించనున్నారు. ప్రస్తుతం నమోదైన లబ్ధిదారుడి డేటాను ఆధారంగా […]

కొత్తగా జారీ చేయనున్న రేషన్‌కార్డు (ఆహార భద్రత) కార్డులకు అత్యంత భద్రతా ప్రమాణాలను (హై సెక్యూరిటీ ఫీచ ర్స్) జోడించి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చినగడానికి వీలు లేకుండా, ఒకవేళ నీటిలో గానీ, నిప్పులో పడిన గానీ చెడిపోకుండా హై డెన్సిటీ పాలిథీన్ ఫైబర్ మెటీరియల్‌ను ఉపయోగించి కార్డులను తయారు చేయాలని నిర్ణయించారు. మూడు సెక్యూరిటీ అంశాలతో రూపొందించిన ఐక్యూఆర్ కోడ్‌తో కూడిన ముద్రను కార్డుపై ఉపయోగించనున్నారు. ప్రస్తుతం నమోదైన లబ్ధిదారుడి డేటాను ఆధారంగా 91 లక్షల కార్డులను ప్రింటింగ్ చేసేందుకు నిర్ణయించారు. ఈసారి ఇంటి యజమానిరాలి పేరిట కార్డును పంపిణీ చేస్తారు. కార్డు వెనుక వైపు కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. వారి పేర్లు, ఆధార్ నంబరు, పుట్టినతేదీ, లబ్ధిదారుల ఫోటోలు, కార్డు రకం (ఎన్‌ఎఫ్‌ఎస్ లేదా ఏఏవై), ఐక్యూఆర్ కోడ్‌తో కూడిన ముద్ర, తహసీల్దార్ లేదా ఏఎస్‌వో సంతకం, కార్డు జారీ చేసిన తేదీలు ఉంటాయి.

First Published:  1 Oct 2015 1:09 PM GMT
Next Story