దీపావళి కానుకగా చీకటి రాజ్యం
దీపావళికి ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రవితేజ నటిస్తున్న బెంగాల్ టైగర్, నాగచైతన్య హీరోగా నటిస్తున్న సాహసమే శ్వాసగా సాగిపో లాంటి సినిమాల్ని దీపావళి కానుకగా బరిలో దించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా చేరిపోయాడు.అంతా ఊహించినట్టుగానే తన అప్ కమింగ్ మూవీ చీకటిరాజ్యాన్ని దీపావళి కానుకగా సిద్ధంచేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం షూటింగ్ పైనల్ స్టేజ్ లో ఉందని, సినిమాను నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు […]
BY sarvi2 Oct 2015 12:34 AM IST
X
sarvi Updated On: 2 Oct 2015 3:16 AM IST
దీపావళికి ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రవితేజ నటిస్తున్న బెంగాల్ టైగర్, నాగచైతన్య హీరోగా నటిస్తున్న సాహసమే శ్వాసగా సాగిపో లాంటి సినిమాల్ని దీపావళి కానుకగా బరిలో దించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా చేరిపోయాడు.అంతా ఊహించినట్టుగానే తన అప్ కమింగ్ మూవీ చీకటిరాజ్యాన్ని దీపావళి కానుకగా సిద్ధంచేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం షూటింగ్ పైనల్ స్టేజ్ లో ఉందని, సినిమాను నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు కమల్ హాసన్. కమల్ దగ్గర శిష్యుడిగా పనిచేసిన రాజేష్.. ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చీకటిరాజ్యాన్ని రికార్డు డేస్ లో షూటింగ్ పూర్తిచేశాడు. సినిమాలో కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో మన్మధబాణం అనే సినిమా వచ్చింది. అది రొమాంటిక్ మూవీ అయితే.. ఇది పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. మరో కీలకపాత్రలో మధుషాలినీ కూడా నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు కమల్. ప్రయోగాత్మకంగా వస్తున్న చీకటిరాజ్యం ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో వేచిచూడాలి.
Next Story