వంద మందిని ఒకేసారి చితక్కొడుతున్న డిక్టేటర్
బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్. సినిమాకు అత్యంత కీలకమైన ఇంటర్వెల్ ఫైట్ ను ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క ఫైట్ కోసమే దాదాపు 50లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ఏకంగా వంద మంది ఫైటర్స్ తో ఈ భారీ ఫైట్ సీన్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఇంటర్వెల్ కు ముందు […]
BY sarvi2 Oct 2015 12:36 AM IST
X
sarvi Updated On: 2 Oct 2015 7:15 AM IST
బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాలయ్య 99వ సినిమా డిక్టేటర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్. సినిమాకు అత్యంత కీలకమైన ఇంటర్వెల్ ఫైట్ ను ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క ఫైట్ కోసమే దాదాపు 50లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ఏకంగా వంద మంది ఫైటర్స్ తో ఈ భారీ ఫైట్ సీన్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఈ ఫైట్ సన్నివేశాలు.. సినిమాకు చాలా కీలకం అని చెబుతున్నారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడు శ్రీవాస్ కూడా ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డిక్టేటర్ లో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ విడుదల తేదీని మాత్రం ఇంకా పక్కాగా ఫిక్స్ చేయలేదు.
Next Story