Telugu Global
Others

బాబుకు మొదలైన సింగపూర్‌ కష్టాలు

రాజధాని నగరానికి శంకుస్థాపన ముహూర్తం తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పాపం చంద్రబాబుకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రాజధాని నిర్మాణపనులు చేపడతాయనుకున్న సింగపూర్‌ కంపెనీలు ఇప్పుడు కొత్త మెలికపెడుతున్నట్లు సమాచారం. భూసేకరణ వివాదాలు ఇంకా ఒక కొలిక్కిరాకపోవడం, రైతులతో ఒప్పందాలు చట్టప్రకారం లేకపోవడం, రైతులకు పైసా చెల్లించకుండానే ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవడం ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో రాజధాని నిర్మాణ పనులను చేపడితే ఇబ్బందుల్లో పడుతామని సింగపూర్‌ కంపెనీలు భావిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి 16 నెలలు అయిపోయింది. […]

బాబుకు మొదలైన సింగపూర్‌ కష్టాలు
X

రాజధాని నగరానికి శంకుస్థాపన ముహూర్తం తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పాపం చంద్రబాబుకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రాజధాని నిర్మాణపనులు చేపడతాయనుకున్న సింగపూర్‌ కంపెనీలు ఇప్పుడు కొత్త మెలికపెడుతున్నట్లు సమాచారం. భూసేకరణ వివాదాలు ఇంకా ఒక కొలిక్కిరాకపోవడం, రైతులతో ఒప్పందాలు చట్టప్రకారం లేకపోవడం, రైతులకు పైసా చెల్లించకుండానే ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవడం ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో రాజధాని నిర్మాణ పనులను చేపడితే ఇబ్బందుల్లో పడుతామని సింగపూర్‌ కంపెనీలు భావిస్తున్నాయి.
చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి 16 నెలలు అయిపోయింది. ఇంకో మూడున్నరేళ్ళ తరువాత ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో నిర్మాణపనులు చేపడితే ఎలాగూ వచ్చే ఎన్నికలనాటికి పనులు పూర్తికావు. రైతులు ఆందోళనలకు దిగినా, వేరే ప్రభుత్వం వచ్చి పాలసీ మార్చుకున్నా తాము ఇబ్బందులు పడుతాము కాబట్టి రాజధాని నిర్మాణ పనుల ఒప్పందాలకు కేంద్రప్రభుత్వం నుంచి హామీ ఇప్పించమని సింగపూర్‌ కంపెనీలు చంద్రబాబుమీద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే చంద్రబాబు పోకడలతో గుర్రుగా వున్న మోడీ ఇలాంటి హామీలు ఇస్తారన్న నమ్మకంలేదు. ఇటీవల చంద్రబాబు సింగపూర్‌, జపాన్ తదితర దేశాల అధ్యక్షులను రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించాడు. కేంద్రం నుంచి ఆహ్వానం లేకుండా వాళ్ళు రాలేరని అందరికీ తెలుసు. కేంద్రం ఆహ్వానించదు. అందుకే వాళ్ళు రావడం లేదు. అలాగే ఇప్పుడు కూడా సింగపూర్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలకు కేంద్రం హామీ ఇవ్వడం కల్ల. అపర చాణిక్యుడు చంద్రబాబు ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తాడో చూడాలి..!

First Published:  2 Oct 2015 6:40 AM IST
Next Story