Telugu Global
Others

ఏపీకి హోదా కోరుతూ కాంగ్రెస్‌ సత్యాగ్రహం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించేవరకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గాంధీ-నెహ్రూ బొమ్మ సెంటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన సమయంలో తమ పార్టీ పార్లమెంటులోనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిందని, ఐదేళ్ళపాటు దీన్ని ఇస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేస్తున్నప్పుడు బీజేపీ […]

ఏపీకి హోదా కోరుతూ కాంగ్రెస్‌ సత్యాగ్రహం
X

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించేవరకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గాంధీ-నెహ్రూ బొమ్మ సెంటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన సమయంలో తమ పార్టీ పార్లమెంటులోనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిందని, ఐదేళ్ళపాటు దీన్ని ఇస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేస్తున్నప్పుడు బీజేపీ పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేసిందని, కాని ఇప్పుడు అదే పార్టీ అధికారంలో ఉండి కూడా మొగం చాటేస్తోందని ఆయన ఆరోపించారు. పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన డిమాండు చేశారు. పట్టిసీమను తెరపైకి తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టును వెనక్కి మళ్ళించిన తెలుగుదేశం ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. కేవలం లంచాల కోసమే పట్టిసీమను నెత్తికెత్తుకున్నారని ఆరోపిస్తూ పోలవరంపై ప్రభుత్వం దృష్టి పెట్టి దాని నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ నిరాహారదీక్ష కార్యక్రమంలో రఘువీరాతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కేవీపీ రామచంద్రరావు, పళ్ళంరాజు, దేవినేని నెహ్రూ, కొండ్రు మురళి, పనబాక లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

First Published:  2 Oct 2015 1:12 AM GMT
Next Story