Telugu Global
Others

ఏపీలో 2017 జూన్‌ 2 ప్రాతిపదికగా స్థానికత

కేబినెట్‌లో నిర్ణయం… వెల్లడించిన మంత్రుల బృందం 2017 జూన్‌ 2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడిన వారే స్థానికుల కిందకు వస్తారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం సమావేశమైన ఏపీ క్యాబినెట్‌ పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ విషయాలను మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు పల్లె రఘునాథరెడ్డి వివరించారు. సుమారు 8గంటలపాటు జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాజధాని అమరావతి శంకుస్థాపన తేదీని ఖరారు చేసినట్టు మంత్రులు చెప్పారు. అక్టోబర్‌ 22వ తేదీ […]

ఏపీలో 2017 జూన్‌ 2 ప్రాతిపదికగా స్థానికత
X

కేబినెట్‌లో నిర్ణయం… వెల్లడించిన మంత్రుల బృందం
2017 జూన్‌ 2లోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడిన వారే స్థానికుల కిందకు వస్తారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం సమావేశమైన ఏపీ క్యాబినెట్‌ పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ విషయాలను మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు పల్లె రఘునాథరెడ్డి వివరించారు. సుమారు 8గంటలపాటు జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాజధాని అమరావతి శంకుస్థాపన తేదీని ఖరారు చేసినట్టు మంత్రులు చెప్పారు. అక్టోబర్‌ 22వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి శంకుస్థాపన చేస్తారని మంత్రులు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఆర్టీసీ బస్‌ ఛార్జీల పెంపు విషయం కూడా చర్చించారు. దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇంకా ఇసుక విధానంపై వస్తున్న విమర్శలు, స్థానికత అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని వారు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై కూడా ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. పట్టిసీమ స్ఫూర్తితో దీన్ని వేగిరంగా పూర్తి చేయాలని, 2018నాటికి ఇది పూర్తవ్వాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనిపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం నుంచి తిరిగి తీసుకోవాలని కూడా చర్చ జరిగింది. ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని తీర్మానించారు. ఉద్యోగుల పిల్లల స్థానికతపై కూడా మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది. మూడేళ్ళ కాలపరిమితితో స్థానికత అంశంపై సమావేశంలో చర్చించారు. ఇసుక విధానంలో ఉన్న లోపాలను తొలగించాలని, దీన్ని సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

First Published:  1 Oct 2015 6:37 PM IST
Next Story