Telugu Global
National

స్వచ్ఛ భారత్‌ నిరంతర ప్రక్రియ: వెంకయ్య

స్వచ్ఛ భారత్‌ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్‌ను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములవ్వాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో 4,64,561 మరుగుదొడ్లు నిర్మించవలసి ఉందని, ఇప్పటికే 11, 80,454 నిర్మాణంలో ఉన్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ఇది ఒకటి, రెండు నెలల్లో అయిపోయే పథకం కాదని, నిరంతర ప్రక్రియగా సాగాల్సినదని, ఈ విషయాన్ని […]

స్వచ్ఛ భారత్‌ నిరంతర ప్రక్రియ: వెంకయ్య
X

స్వచ్ఛ భారత్‌ విజయవంతానికి అందరూ కృషి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్‌ను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములవ్వాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో 4,64,561 మరుగుదొడ్లు నిర్మించవలసి ఉందని, ఇప్పటికే 11, 80,454 నిర్మాణంలో ఉన్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ఇది ఒకటి, రెండు నెలల్లో అయిపోయే పథకం కాదని, నిరంతర ప్రక్రియగా సాగాల్సినదని, ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. మార్పు అనేది ఒక్కరోజులోను, ఒక్క నెలలోను జరుగుతుందని ఊహించకూడదని, దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ప్రజలు ముందుకెళ్ళగలిగితే అద్బుతాలు సాధించవచ్చని ఆయన అన్నారు.

First Published:  1 Oct 2015 10:25 AM IST
Next Story