రూ. 3770 కోట్లతో బయటపడిన నల్లకుబేరులు
బ్లాక్‌మనీని బయటకు రప్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించిన స్వచ్ఛంద ప్రకటన స్కీమ్‌కు మంచి రెస్పాన్సే లభించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీని వెల్లడిస్తే దానిపై 30 శాతం పన్నుతోపాటు 30 శాతం అపరాధ రుసుమును ఈ యేడాది డిసెంబర్ 31వ తేదీలోపు చెల్లించవచ్చని ప్రకటించింది. ఒకవేళ తర్వాత కేంద్రం చేపట్టే చర్యల్లో ఇలా ప్రకటించని వారు దొరికితే ఫెమా కింద కఠిన చర్యలుంటాయని, అక్రమార్జనపై 200 శాతం పన్ను […]
బ్లాక్‌మనీని బయటకు రప్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించిన స్వచ్ఛంద ప్రకటన స్కీమ్‌కు మంచి రెస్పాన్సే లభించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీని వెల్లడిస్తే దానిపై 30 శాతం పన్నుతోపాటు 30 శాతం అపరాధ రుసుమును ఈ యేడాది డిసెంబర్ 31వ తేదీలోపు చెల్లించవచ్చని ప్రకటించింది. ఒకవేళ తర్వాత కేంద్రం చేపట్టే చర్యల్లో ఇలా ప్రకటించని వారు దొరికితే ఫెమా కింద కఠిన చర్యలుంటాయని, అక్రమార్జనపై 200 శాతం పన్ను వేయడంతోపాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందన్న హెచ్చరిక నల్ల కుబేరులను బాగానే భయపెట్టింది. జులై 1న ఈ స్వచ్ఛంద స్కీమ్‌ను ప్రకటిస్తూ ఇలా ప్రకటించేవారికి వెసులుబాటు కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ-పోర్టల్‌తోపాటు ఢిల్లీలో ఓ ప్రత్యేక ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈనేపథ్యంలో చివరి రోజైన సెప్టెంబర్ 30న తమ విదేశీ ఖాతాల వివరాలు వెల్లడించేందుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, వారి ప్రతినిధులు ఢిల్లీలోని ప్రత్యేక ఐటీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. గడువు ముగిసే సమయానికి 638 మంది ముందుకొచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్ పర్సన్ అనితా కపూర్ తెలిపారు. విదేశాల్లోని వారి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 3770 కోట్ల నల్ల ధనం ఉన్నట్లు ఈ బ్లాక్ మనీ ఉన్నవారు ప్రకటించారని ఆమె వివరించారు.