వారసత్వంపై నాటి బాసలేమయ్యాయి బాబు!
రాజకీయాలు భూమిలాంటివే, తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎదుటివారిపై రాయి విసిరితే అది బూమరాంగ్ అయి మన మీదే పడుతుంది. వారసత్వ రాజకీయాల విషయంలో ఇప్పుడు టీడీపీది అదే పరిస్థితి. చినబాబు లోకేష్ టీడీపీ జాతీయ కమిటీలో ప్రధానకార్యదర్శిగా, పొలిట్‌బ్యూరోలో ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఎదిగిన వేళ వారసత్వ రాజకీయంపై గతంలో బాబు ప్రకటనలను నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై టీడీపీ తరచు విమర్శలు చేస్తూనే […]
BY sarvi1 Oct 2015 7:00 AM IST
X
sarvi Updated On: 1 Oct 2015 7:08 AM IST
రాజకీయాలు భూమిలాంటివే, తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎదుటివారిపై రాయి విసిరితే అది బూమరాంగ్ అయి మన మీదే పడుతుంది. వారసత్వ రాజకీయాల విషయంలో ఇప్పుడు టీడీపీది అదే పరిస్థితి. చినబాబు లోకేష్ టీడీపీ జాతీయ కమిటీలో ప్రధానకార్యదర్శిగా, పొలిట్‌బ్యూరోలో ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఎదిగిన వేళ వారసత్వ రాజకీయంపై గతంలో బాబు ప్రకటనలను నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై టీడీపీ తరచు విమర్శలు చేస్తూనే వచ్చింది. కాంగ్రెస్‌లా తమది వారసత్వ పార్టీ కాదని, జెండా మోసి భుజం కమిలిపోయిన వారే నాయకులవుతారంటూ గొప్పలు చెబుతూ వచ్చారు. గాంధీ కుటుంబవారసుడిగా రాహుల్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా దేశం మీ కుటుంబ జాగీరనుకుంటున్నారా అంటూ గాంధీ కుటుంబంపై ఇదే బాబుగారు భగ్గుమన్నారు.
కేసీఆర్ తన కుమారుడు, కూతురిని రాజకీయాల్లోకి తెస్తే ఇదే తెలుగు తమ్ముళ్లు నానా యాగీ చేశారు. అమెరికా నుంచి కొడుకు, కూతురిని తీసుకొచ్చి నేరుగా పదవులు కట్టబెట్టారని విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వైఎస్ వారసుడిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారసత్వం రాజకీయమంటూ విమర్శలు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు చేసిందేమిటి?. పార్టీకి ఏ సేవలు చేశారని నేరుగా కీలకమైన కమిటీల్లో లోకేష్‌కు స్థానం కల్పించారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఇది వారసత్వ రాజకీయాలు కావా అని నిలదీస్తున్నారు. బాబు చేస్తే బాగు… పక్కోడు చేస్తే బూతు అవుతుందా అన్నది వారి ప్రశ్న.
Next Story