Telugu Global
Others

టీడిపి జాతీయపార్టీ కాదు... ఎందుకంటే

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రాంతీయ పార్టీ అంటే తెలుగుతమ్ముళ్లు అస్సలు ఒప్పుకోవడం లేదు. మాది జాతీయ పార్టీ అంటూ బల్లగుద్ది ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించి కేంద్ర కమిటీతోపాటు, రెండు రాష్ట్రాలకు విడిగా అధ్యక్షులను ప్రకటించారు. అయితే టీడీపీ జాతీయ పార్టీ అన్నది కేవలం ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి కోసం ప్రకటించుకున్నదేనని నిబంధనలు చెబుతున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం  ఇప్పటికిప్పుడు టీడీపీకి జాతీయ పార్టీ […]

టీడిపి జాతీయపార్టీ కాదు... ఎందుకంటే
X

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రాంతీయ పార్టీ అంటే తెలుగుతమ్ముళ్లు అస్సలు ఒప్పుకోవడం లేదు. మాది జాతీయ పార్టీ అంటూ బల్లగుద్ది ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టే చంద్రబాబు కూడా టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించి కేంద్ర కమిటీతోపాటు, రెండు రాష్ట్రాలకు విడిగా అధ్యక్షులను ప్రకటించారు. అయితే టీడీపీ జాతీయ పార్టీ అన్నది కేవలం ఆ పార్టీ నేతలు ఆత్మ సంతృప్తి కోసం ప్రకటించుకున్నదేనని నిబంధనలు చెబుతున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు టీడీపీకి జాతీయ పార్టీ హోదా వచ్చే సూచనలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీని నేషనల్ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందాలంటే మూడు మార్గాలున్నాయి.

  1. ఒక పార్టీ గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో కనీసం రెండు శాతం సీట్లు గెలవాలి. అంటే కనీసం 11 స్థానాలు గెలవాలి. అది కూడా ఈ పదకొండు సీట్లలో మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. అంటే ఈ నిబంధన కింద టీడీపీకి జాతీయపార్టీ హోదా రాదు. ఎందుకంటే టీడీపీ గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే ఎంపీ స్థానాలు గెలుచుకుంది . లేదా
  1. కనీసం నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఓట్లు సాధించడమే కాదు కనీసం నాలుగు లోక్‌సభ సీట్లును సాధించాలి. ఈ నిబంధన కింద కూడా టీడీపీకి జాతీయహోదా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీ, తెలంగాణలో మాత్రమే ఆ స్థాయిలో ఓట్లను టీడీపీ గెలుచుకోగలిగింది. లేదా
  1. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉండాలి. అది కూడా టీడీపీకి లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు టీడీపీ జాతీయపార్టీ హోదా వచ్చే అవకాశం లేదు.

ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో ఘోరమైన ప్రదర్శన ఇచ్చిన బీఎస్పీ, ఎన్‌సీపీ, సీపీఐల జాతీయ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆయా పార్టీలకు ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందితే దేశ వ్యాప్తంగా సదరు పార్టీకి ఒకే ఎన్నికల గుర్తు వస్తుంది. ఎన్నికల సమయంలో జాతీయ పార్టీల ప్రచారం కోసం దూరదర్శన్ చానల్‌లో నిర్ణీత సమయాన్ని కూడా కేటాయిస్తారు.

Read in English TDP can’t be recognized a National Party, because…..

First Published:  1 Oct 2015 1:02 AM IST
Next Story