Telugu Global
Cinema & Entertainment

ఐటీ దాడుల వెనుక అమ్మ

సినీ తారలు విజయ్, నయనతార, సమంత ఇళ్లపై ఐటీ శాఖ మెరుపు దాడులు కలకలం రేపాయి. సినీతారల ఇళ్లపై ఐటీ దాడులు కొత్తేమీ కాకపోయినా హీరో విజయ్‌పై ఐటీ దాడి మాత్రం అలాంటి కాదని తమిళ సినీపరిశ్రమ గుసగుసలాడుకుంటోంది. ఐటీ దాడుల వెనుక అమ్మ ఆగ్రహం ఉందని విశ్లేషిస్తున్నారు. గతంలో  అన్నా డీఎంకేకు విజయ్ మద్దతుదారుడిగా ఉండేవాడు. అయితే కొద్దికాలంగా విజయ్ సొంతంగా ముందుకెళ్తున్నారు. జయ పార్టీ  అంటే అస్సలు ఇష్టపడడం లేదట. అలా అమ్మ జయలలితకు […]

ఐటీ దాడుల వెనుక అమ్మ
X

సినీ తారలు విజయ్, నయనతార, సమంత ఇళ్లపై ఐటీ శాఖ మెరుపు దాడులు కలకలం రేపాయి. సినీతారల ఇళ్లపై ఐటీ దాడులు కొత్తేమీ కాకపోయినా హీరో విజయ్‌పై ఐటీ దాడి మాత్రం అలాంటి కాదని తమిళ సినీపరిశ్రమ గుసగుసలాడుకుంటోంది. ఐటీ దాడుల వెనుక అమ్మ ఆగ్రహం ఉందని విశ్లేషిస్తున్నారు. గతంలో అన్నా డీఎంకేకు విజయ్ మద్దతుదారుడిగా ఉండేవాడు. అయితే కొద్దికాలంగా విజయ్ సొంతంగా ముందుకెళ్తున్నారు. జయ పార్టీ అంటే అస్సలు ఇష్టపడడం లేదట. అలా అమ్మ జయలలితకు వ్యతిరేకిగా మారినప్పటి నుంచే విజయ్‌కు కష్టాలు మొదలయ్యాయని తమిళ పరిశ్రమ పెద్దలు ఉదాహరణలతో సహా చెబుతున్నారు.

విజయ్‌ నటించిన కత్తి, తలైవా చిత్రాల విడుదల సమయంలోనూ రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కరెక్ట్‌గా పులి సినిమా విడుదలకు ఒక రోజు ముందే ఐటీ దాడులు జరగడంపై అమ్మ మరోసారి ఆగ్రహించిందని చెప్పుకుంటున్నారు. ఏకకాలంలో ఐటీ దాడులతో విస్తుపోయిన విజయ్… సీఎం జయలలిత అపాయింట్‌మెంట్ కోసం శతవిధాల ప్రయత్నించారని సమాచారం. విజయ్‌ను కలిసేందుకు జయ మాత్రం సానుకూల స్పందించలేదని చెప్పుకుంటున్నారు. అయితే ఐటీ శాఖ అధికారులను జయ ఎలా ప్రభావితం చేశారన్న దానిపై మాత్రం ఖచ్చితమైన సమాధానం రావడం లేదు.

మరోవైపు చెన్నై, కొచ్చిన్, తిరువనంతపురం, హైదరాబాద్‌లోని నయనతార, సమంత ఇళ్లు, కార్యాలయాలపైనా ఐటీ రైడ్స్ జరిగాయి. ఐటీ దాడులతో సమంత తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తమ కుమార్తె చాలాకాలంగా ఇంటికి రావడం లేదని…ఆమె వస్తువులేవీ తమవద్ద లేవని సమంత తల్లిదండ్రులు వాపోయారు. తమకున్న దాంట్లోనే బతుకుతున్నామని, సమంత ఆస్తిపాస్తులతో తమకు సంబంధం లేదని ఆమె తండ్రి జోసఫ్ ప్రభు చెప్పారు.

First Published:  1 Oct 2015 1:49 AM IST
Next Story