ఏపీలోనూ నిప్పు రాజేస్తున్న హార్థిక్ పటేల్
పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇటీవల గుజరాత్‌ను అల్లకల్లోలం చేసిన హార్థిక్ పటేల్ తన ఉద్యమాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చేసేందుకు పావులు కదుపుతున్నారు. తన సామాజికవర్గమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న సామాజికవర్గాలను సంఘటితం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కుర్మీ, గుజ్జర్లు, మరాఠా, పటేళ్లను కలుపుకుని అఖిల భారతీయ పటేల్ నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేస్తున్నట్టు హార్థిక పటేల్ బుధవారం ప్రకటించారు. పనిలో పనిగా ఏపీలో […]
పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇటీవల గుజరాత్‌ను అల్లకల్లోలం చేసిన హార్థిక్ పటేల్ తన ఉద్యమాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చేసేందుకు పావులు కదుపుతున్నారు. తన సామాజికవర్గమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న సామాజికవర్గాలను సంఘటితం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కుర్మీ, గుజ్జర్లు, మరాఠా, పటేళ్లను కలుపుకుని అఖిల భారతీయ పటేల్ నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేస్తున్నట్టు హార్థిక పటేల్ బుధవారం ప్రకటించారు. పనిలో పనిగా ఏపీలో రిజర్వేషన్లు కోరుతున్న కాపులకు మద్దతు ప్రకటించారు. కాపులను బీసీల్లోకి చేర్చాలన్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. తమ రిజర్వేషన్ల ఉద్యమంలో కాపులను కూడా కలుపుకుని ముందుకు సాగుతామని ప్రకటించారు.
అదే జరిగితే ఏపీలోనూ రిజర్వేషన్ల అలజడి ప్రారంభమవుతున్న భావన వ్యక్తమవుతోంది. హార్థిక్ పటేల్ గుజరాత్‌లో చేసిన ఉద్యమాన్నిచూసి ఇప్పటికే కొందరు కాపులు ఆయనను సంప్రదించినట్టు సమాచారం. ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై హార్థిక్‌తో వారు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే కాపులను బీసీల్లోకి చేర్చే ప్రయత్నాలను ఇప్పటికే ఉన్న బీసీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏపీలో కాపుల జనాభా అధికంగా ఉండడంతో పాటు వారు ఆర్ధికంగా మరీ దారుణమైన పరిస్థితుల్లో ఏమీ లేరని బీసీలు వాదిస్తున్నారు. అధిక జనాభా ఉన్న కాపులు బీసీల్లోకి వస్తే తమ అవకాశాలు తీవ్రస్థాయిలో గండిపడుతుందని ఆందోళన చెందుతున్నారు.