అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన
అక్టోబర్ 22న మధ్యాహ్నం 12.35-12.45 మధ్యలో రాజధాని నగరంగా అమరావతి శంకుస్థాపన జరగబోతోంది. ఈ వేడుకకు లక్షమందిని ఆహ్వానిస్తున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా రాజధానికి భూమిపూజ జరుగుతుందన్నారు. శంకుస్థాపనకు సింగపూర్, జపాన్ ప్రధానులు వస్తున్నారని తెలిపారు. పదివేల గ్రామాల నుంచి రైతులను ఆహ్వానిస్తున్నామని మంత్రి చెప్పారు. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను నిర్వహించబోతున్నామని ఆయన వివరించారు.