కేజ్రీవాల్ సపోర్ట్ తో నితీష్ కి క్రేజి..
బీహార్ లో ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనతాపరివార్ కూటమి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచార హోరెత్తుతోంది. ఇలాంటి కీలక సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. నితీష్ చాలా మంచి వ్యక్తి అని, నితీష్ కే ఓటేయాలని బీహార్ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 12 నుంచి జరిగే ఎన్నికల్లో నితీష్ […]
బీహార్ లో ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనతాపరివార్ కూటమి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచార హోరెత్తుతోంది. ఇలాంటి కీలక సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. నితీష్ చాలా మంచి వ్యక్తి అని, నితీష్ కే ఓటేయాలని బీహార్ ప్రజలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 12 నుంచి జరిగే ఎన్నికల్లో నితీష్ కుమార్ కూటమికి మద్దతు పలకాలని అభ్యర్థించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని.. ఎవరి తరుఫున ప్రచారం చేయడం లేదంటూ మీడియాలో వస్తున్న వార్తలను కూడా కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. బీహార్ ఎన్నికల్లో తన మద్దతు జేడీయూనేనని మరోసారి ఆయన స్పష్టం చేశారు. నిజానికి కేజ్రీవాల్, నితీష్ మధ్య స్నేహ బంధం ఈనాటిది కాదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీకి నితీష్ పార్టీ జేడీయూ మద్దతు ప్రకటించింది. అంతకుముందు వారణాసిలో నరేంద్ర మోడీపై పోటీ చేసిన కేజ్రీవాల్ కు అప్పట్లో జేడీయూ మద్దతు పలికింది.
మొత్తం మీద బీహార్ లో కులసమీకరణాలతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నితీష్ కు మద్దతు పలకడం ఇప్పడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే బీహార్ లో కేజ్రీవాల్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆయన ప్రభావం ఎన్నికలపై ఏమాత్రం ఉండబోదని కమలనాథులు అంచనా వేస్తున్నారు.