wonder world 42
వేలానికి అమెరికా అధ్యక్ష విమానం! యాభైవేల డాలర్లుంటే చాలు… అమెరికా అధ్యక్షుడు ప్రయాణించిన విమానం మీ సొంత మవుతుంది. గెరాల్డ్ ఫోర్డ్ నుంచి జార్జి బుష్ వరకు పలువురు అధ్యక్షులు వాడిన ఓ విమానాన్ని వేలానికి ఉంచారు. అమెరికా అధ్యక్షుడు వాడిన విమానానికి ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ అని పేరు. అలాంటి విమానాలలో ‘డిసి 9-32’ రకం విమానానికి అమెరికా ప్రభుత్వం వేలానికి ఉంచింది. ఈ విమానం ప్రధాన క్యాబిన్‌లో 32 సీట్లున్నాయి. ఈ విమానంలో ఫోర్డ్, కార్టర్, […]
వేలానికి అమెరికా అధ్యక్ష విమానం!
యాభైవేల డాలర్లుంటే చాలు… అమెరికా అధ్యక్షుడు ప్రయాణించిన విమానం మీ సొంత మవుతుంది. గెరాల్డ్ ఫోర్డ్ నుంచి జార్జి బుష్ వరకు పలువురు అధ్యక్షులు వాడిన ఓ విమానాన్ని వేలానికి ఉంచారు. అమెరికా అధ్యక్షుడు వాడిన విమానానికి ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ అని పేరు. అలాంటి విమానాలలో ‘డిసి 9-32’ రకం విమానానికి అమెరికా ప్రభుత్వం వేలానికి ఉంచింది. ఈ విమానం ప్రధాన క్యాబిన్‌లో 32 సీట్లున్నాయి. ఈ విమానంలో ఫోర్డ్, కార్టర్, రీగన్, బుష్, క్లింటన్, జూనియర్ బుష్ వంటి పలువురు అమెరికా అధ్యక్షులు ప్రయాణించారు. వారితోపాటు పలువురు ఉపాధ్యక్షులు, అమెరికా అధ్యక్షుల భార్యలు, మంత్రులు, 4స్టార్ జనరల్స్, అడ్మిరల్స్, విదేశీ ప్రతినిధులు పలువురు ప్రయాణించారు. మెక్‌డొనాల్ డగ్లస్ కంపెనీ ఈ విమానాన్ని తయారు చేసింది. ఎఫ్ 15 రకం యుద్ధవిమానాలను, ఎఫ్ – 18 రకం సూపర్ హర్నెట్ విమానాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ప్రస్తుతం ఈ విమానం అరిజోనాలోని మీసాలో గల ఫోనిక్స్ మీసా గేట్‌వే ఎయిర్‌పోర్టులో ఉంది. అయితే మీరు ఎప్పుడుబడితే అప్పుడు వెళ్లి ఈ విమానాన్ని తనిఖీ చేసుకోవడానికి వీల్లేదు. అందుకోసం ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవలసి ఉంటుందని జీఎస్‌ఏ అధికారులు తెలిపారు. వేలంలో ఎక్కువ ధర చెల్లించడానికి ముందుకొచ్చేవారికి ఈ విమానం సొంతమవుతుందని వారు పేర్కొన్నారు. 50 వేల డాలర్లనేది ప్రారంభ ధర మాత్రమే. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరు పాడితే వారికి విమానం దక్కుతుంది.