Telugu Global
National

చదువుల తల్లి ముద్దుబిడ్డలు

సి బి ఎస్ సి పన్నెండవ తరగతి పరీక్షల ఫలితాలలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. గడిచిన కొద్ది సంవత్సరాలలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలలో బాలికలు బాలురను మించి టాప్ పొజిషన్ దక్కించుకోవడం చూస్తున్నాం. కేంద్ర స్థాయిలో సెకండరి విద్య పరీక్షలు నిర్వహించే సి బి ఎస్ సి పరీక్షలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించి మరో విశేషమేమంటే ఉత్తరాది కన్నా దక్షిణాది విద్యార్దులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వారిలో తమిళనాడు […]

చదువుల తల్లి ముద్దుబిడ్డలు
X

సి బి ఎస్ సి పన్నెండవ తరగతి పరీక్షల ఫలితాలలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. గడిచిన కొద్ది సంవత్సరాలలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలలో బాలికలు బాలురను మించి టాప్ పొజిషన్ దక్కించుకోవడం చూస్తున్నాం. కేంద్ర స్థాయిలో సెకండరి విద్య పరీక్షలు నిర్వహించే సి బి ఎస్ సి పరీక్షలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించి మరో విశేషమేమంటే ఉత్తరాది కన్నా దక్షిణాది విద్యార్దులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వారిలో తమిళనాడు విద్యార్దులు ఫస్టున నిలిచారు. పన్నెండవ తరగతి పరీక్షలల్లో ఉత్తమంగా నిలిచినా మొదటి ఇరవై స్కూళ్ళలో పదిహేను దక్షిణాదిలోనే వున్నాయి. దేశ రాజధాని డిల్లి నుంచి ఒక స్కూల్ ఇరవైలో ఒకటిగా నిలిచింది. గమనించాల్సిన మరో విషయమేమంటే కేవలం ప్రైవేటు స్కూల్లే కాక రెండు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయాలు కూడా వుండటం. చెన్నై, బెంగళూరు స్కూళ్ళతో పాటు కేరళ నుంచి రెండు, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఒక స్కూల్ జాబితాలో వున్నాయి. జాబితాలో మొదటి మూడు స్థానాలు పొందిన స్కూళ్ళు చెన్నైలో వున్నాయి. అవన్నీ డి ఏ వి స్కూళ్ళు. ఆ విద్యార్ధులు 92.3 శాతం సగటు సాధించారు.

First Published:  30 Sept 2015 2:56 AM IST
Next Story