ప్రొఫెసర్ ఉద్యోగాని"కో..దండం!"
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రొఫెసర్ ఉద్యోగానికో దండం అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులకు ద్రోణాచార్యుడి లాంటి గురువైన ఈ విశ్వవిద్యాలయ ఆచార్యులు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా తెలుగు రాష్ర్టాల నుంచి ఢిల్లీ పాలకుల వరకూ అందరికీ సుపరిచితమైన కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండరామిరెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేస్తూనే ఉద్యమానికి ఊపిరిలూదాడు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెలంగాణ […]
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రొఫెసర్ ఉద్యోగానికో దండం అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులకు ద్రోణాచార్యుడి లాంటి గురువైన ఈ విశ్వవిద్యాలయ ఆచార్యులు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా తెలుగు రాష్ర్టాల నుంచి ఢిల్లీ పాలకుల వరకూ అందరికీ సుపరిచితమైన కోదండరాం అసలు పేరు ముద్దసాని కోదండరామిరెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేస్తూనే ఉద్యమానికి ఊపిరిలూదాడు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారు. అయితే తెలంగాణ వచ్చిన తరువాత గులాబీ దళపతి ఈ జేఏసీ చైర్మన్ ను దూరం పెట్టారు. ప్రొఫెసర్ కూడా పదవుల కోసం పాకులాడడంలాంటి పనులు చేయకపోవడం ఆయన హుందాతనాన్ని మరింత పెంచింది. ఇదే సమయంలో రైతు సమస్య పరిష్కారానికి మరో జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు కోదండరాం. ఇప్పుడు ప్రొఫెసర్‌గా కూడా రిటైరవుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలున్నాయి. అయితే తనకు రాజకీయాలు సరిపడవంటున్నారీ జేఏసీల రూపశిల్పి.