పార్శిల్ బాంబులు పేలి ఆరుగురి మృతి
చైనాలో పార్శిల్ బాంబులు పేలిన దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. చైనాలోని గ్వాంఝై ప్రాంతంలో ప్రభుత్వ ఆఫీసులతో సహా పదికిపైగా ప్రాంతాల్లో ఇలాంటి 15 పార్శిల్ బాంబులు పేలాయి. చైనా జాతీయ దినోత్సవంనాడు ఈ దుర్ఘటన జరిగింది. స్వీడ్ డెలివరీ పార్శిళ్ళలో పేలుడు పదార్థాలను అమర్చి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. జైలు, ప్రభుత్వ కార్యాలయం, షాపింగ్ సెంటర్లో పార్శిల్ బాంబులు పేలాయి. ఓ భవంతి సగానికి కూలి పోగా, రోడ్డుపై నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.