ఫేస్‌బుక్ రాకముందే మోదీ ఎలా చేరారు?
తమ గురించి తాము చెప్పుకునే క్రమంలో కొందరు నోరుజారుతూ ఉంటారు. అది అంతర్జాతీయ వేదిక అయితే, అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఎవరో కాదు.. సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్రమోదీ. అమెరికా పర్యటన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో చేరడంపై ఓ కామెంట్ చేశారు. మోదీ అభిమానులు దాన్ని లైట్ తీసుకున్నా.. విపక్షాలు మాత్రం ఆయన కోతలు కోస్తున్నారంటున్నట్లుగా చురకలు అంటిస్తున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించిన మోదీ ఫేస్‌బుక్ […]
BY admin30 Sept 2015 1:13 AM IST
X
admin Updated On: 30 Sept 2015 5:23 AM IST
తమ గురించి తాము చెప్పుకునే క్రమంలో కొందరు నోరుజారుతూ ఉంటారు. అది అంతర్జాతీయ వేదిక అయితే, అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఎవరో కాదు.. సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్రమోదీ. అమెరికా పర్యటన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో చేరడంపై ఓ కామెంట్ చేశారు. మోదీ అభిమానులు దాన్ని లైట్ తీసుకున్నా.. విపక్షాలు మాత్రం ఆయన కోతలు కోస్తున్నారంటున్నట్లుగా చురకలు అంటిస్తున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించిన మోదీ ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫేస్‌బుక్‌పై చేసిన వ్యాఖ్య లు హాస్యాస్పదంగా ఉన్నాయని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. 2002లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిని కాకముందే సోషల్‌మీడియా లో చేరినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య లు ఎంతమాత్రం సమర్థనీయంగా లేవని మాజీ సీఎం ఒమర్ మంగళవారం ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్ 2004లో, ట్విట్టర్ 2006 ప్రారంభమయ్యాయని, మరి మోదీ ఏ సోషల్‌మీడియాలో చేరారో..? అని ఎద్దేవా చేశారు
Next Story