నారాయణ' విద్యార్థి ఆత్మహత్య యత్నం!
లెక్చరర్లు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేని నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యా యత్నం చేశాడు. భరత్‌కుమార్ అనే విద్యార్థి అనంతపురంలోని నారాయణ కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. సరిగా చదవడం లేదని, మార్కులు సరిగా రావడం లేదని దూషించి లెక్చరర్లు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక బుధవారం ఉదయం తన ఇంటిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సకాలంలో తల్లిదండ్రులు గుర్తించి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కళాశాలపై బాధిత బంధువుల దాడి విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై ఆగ్రహం చెందిన విద్యార్ధి […]
లెక్చరర్లు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేని నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యా యత్నం చేశాడు. భరత్‌కుమార్ అనే విద్యార్థి అనంతపురంలోని నారాయణ కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. సరిగా చదవడం లేదని, మార్కులు సరిగా రావడం లేదని దూషించి లెక్చరర్లు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక బుధవారం ఉదయం తన ఇంటిలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సకాలంలో తల్లిదండ్రులు గుర్తించి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కళాశాలపై బాధిత బంధువుల దాడి
విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై ఆగ్రహం చెందిన విద్యార్ధి బంధువులు, విద్యార్ధి సంఘాలు కళాశాలపై దాడి చేశాయి. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి తాను ఆత్మహత్యాయత్నానికి కారణం…. కాలేజీ లెక్చర్‌ర్ల ఒత్తిడేనని పోలీసులకు తెలిపాడు. అయితే కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా పోలీసులు ఆ స్టేట్‌మెంట్‌ను మార్చారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు.