ఏపీ, తెలంగాణ మధ్య "బోట్" ఫైట్
ఏపీ, తెలంగాణ మధ్య నెలకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. లేటెస్ట్‌గా రెండు రాష్ట్రాల టూరిజం శాఖల మధ్య వివాదం రగిలింది. ఇందుకు నాగార్జునసాగర్ సమీపంలోని అనుపు ప్రాంతం వేదికైంది. ఇటీవల తెలంగాణ టూరిజం శాఖ కోటి 80 లక్షలతో నాగార్జున సాగర్ వద్ద లాంచీ స్టేషన్ ఏర్పాటుకు పూనుకుంది. ఇందులో భాగంగా దిగుమతి చేసుకున్న లాంచీ విడిభాగాలను విశాఖ నుంచి మూడు లారీల్లో తీసుకొచ్చారు. అనుపు దగ్గరకు తీసుకెళ్లి అక్కడే విడిభాగాలను అమర్చే ప్రయత్నం చేశారు. […]
BY admin30 Sept 2015 1:44 AM GMT
X
admin Updated On: 30 Sept 2015 1:44 AM GMT
ఏపీ, తెలంగాణ మధ్య నెలకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. లేటెస్ట్‌గా రెండు రాష్ట్రాల టూరిజం శాఖల మధ్య వివాదం రగిలింది. ఇందుకు నాగార్జునసాగర్ సమీపంలోని అనుపు ప్రాంతం వేదికైంది. ఇటీవల తెలంగాణ టూరిజం శాఖ కోటి 80 లక్షలతో నాగార్జున సాగర్ వద్ద లాంచీ స్టేషన్ ఏర్పాటుకు పూనుకుంది. ఇందులో భాగంగా దిగుమతి చేసుకున్న లాంచీ విడిభాగాలను విశాఖ నుంచి మూడు లారీల్లో తీసుకొచ్చారు. అనుపు దగ్గరకు తీసుకెళ్లి అక్కడే విడిభాగాలను అమర్చే ప్రయత్నం చేశారు. అనుపు వద్ద సరిపడ నీరు ఉండడంతో అక్కడే బోటింగ్‌కు ప్లాన్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న ఏపీ టూరిజం సిబ్బంది అక్కడికి చేరుకుని అభ్యంతరం చెప్పారు. తమ భూభాగంలోని నీటిలో బోటింగ్ ఏంటని అడ్డుపడ్డారు. హుస్సేన్‌సాగర్‌లో తామొచ్చి బోటింగ్ నిర్వహిస్తే ఒప్పుకుంటారాని వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి అతిక్రమణ ఉద్దేశం లేదని చెప్పారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటు ఏపీ నుంచి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీకి చెందిన కార్యకర్తలు, ఇటు తెలంగాణ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరస్పరం నినాదాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఏపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. చివరకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.
Next Story