బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల!
అడవిలోంచి గ్రామం మీద పడింది. దాహమయ్యిందనుకుంటా… నీటి కోసం బిందెలో తల పెట్టింది. అంతే… దాహమాట దేవుడెరుగు… అందులో తల ఇరుక్కుపోయింది. నీరు తాగిందో లేదో కాని దేహమంతా చెమటలు పట్టాయి. ఇంతకీ చిత్రంలో చూశారు కదా… ఇదీ చిరుతపులి పరిస్థితి. చిరుత చేసే గాండ్రింపులు విని భయపడి పోయారు. బిక్కుబిక్కు మంటూ అది ఎక్కడుందా అని చూశారు. బిందెలో ఇరుక్కుపోయిన తలతో కనిపించేసరికి భయం కాస్తా జాలిగా మారిపోయింది. కాని ఏదో పిల్లో… మేకో అయితే […]
అడవిలోంచి గ్రామం మీద పడింది. దాహమయ్యిందనుకుంటా… నీటి కోసం బిందెలో తల పెట్టింది. అంతే… దాహమాట దేవుడెరుగు… అందులో తల ఇరుక్కుపోయింది. నీరు తాగిందో లేదో కాని దేహమంతా చెమటలు పట్టాయి. ఇంతకీ చిత్రంలో చూశారు కదా… ఇదీ చిరుతపులి పరిస్థితి. చిరుత చేసే గాండ్రింపులు విని భయపడి పోయారు. బిక్కుబిక్కు మంటూ అది ఎక్కడుందా అని చూశారు. బిందెలో ఇరుక్కుపోయిన తలతో కనిపించేసరికి భయం కాస్తా జాలిగా మారిపోయింది. కాని ఏదో పిల్లో… మేకో అయితే గ్రామస్థులే చొరవ తీసుకుని బిందెలోంచి పులి తల బయటికి తీసేవారు. బిందెలో కూరుకుపోయిన చిరుతను చూసి జాలి పడడం తప్ప ఎవరూ ధైర్యం చేసి బిందెను దాన్నుంచి వేరు చేయలేకపోయారు. వణికిపోతూనే వారికి తెలిసిన అటవీ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు ఇంకా రాలేదు… బిందెలో ఇరుక్కుపోయిన తలతో చిరుత పులి అటూఇటూ తిరుగుతూ హడావుడి చేస్తోంది. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు మాత్రం అటవీ అధికారుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ అరుదైన సంఘటన రాజస్థాన్లోని సమంద్ జిల్లా అటవీప్రాంత గ్రామంలో చోటు చేసుకుంది.
https://www.youtube.com/watch?v=fmg5z-qwY9I