Telugu Global
Others

పొగాకు రైతులకు బాసటగా జగన్‌ దీక్ష

పొగాకు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నడుం బిగించారు. రైతుల వద్ద ఉన్న లో-గ్రేడ్ సహా అన్ని రకాల పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ప్రకాశం జిల్లా టంగుటూరులో జగన్‌ నిరసన చేపట్టారు. రైతాంగంలో ఆత్మస్థైర్యాన్ని నింపి, బతుకుపై భరోసా కల్పించాలని జగన్ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపు ఇచ్చారు. 1983లో పొగాకు వ్యాపారుల మోసాన్ని ఎదిరించి వేలం […]

పొగాకు రైతులకు బాసటగా జగన్‌ దీక్ష
X

పొగాకు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నడుం బిగించారు. రైతుల వద్ద ఉన్న లో-గ్రేడ్ సహా అన్ని రకాల పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ప్రకాశం జిల్లా టంగుటూరులో జగన్‌ నిరసన చేపట్టారు. రైతాంగంలో ఆత్మస్థైర్యాన్ని నింపి, బతుకుపై భరోసా కల్పించాలని జగన్ ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపు ఇచ్చారు. 1983లో పొగాకు వ్యాపారుల మోసాన్ని ఎదిరించి వేలం కేంద్రాల ఏర్పాటుకు రైతులు ‘టంగుటూరు ఉద్యమం’ నడిపిన ప్రాంతాన్ని జగన్‌ తన దీక్షకు ఎంచుకున్నారు. అంతకుముందు టంగుటూరు పోగాకు కొనుగోలు కేంద్రాన్ని వైసీపీ నేత జగన్‌ సందర్శించారు. అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. లో క్వాలిటీ పొగాకుకు కనీస ధర కూడా ఇవ్వడం లేదని రైతులు జగన్‌ వద్ద వాపోయారు. పొగాకు కొనుగోలు రేట్లపై రైతుల నుంచి మరింత సమాచారం అడిగి తెలుసుకున్న జగన్‌ రైతుల పరిస్థితిపై పోగాకు బోర్డు అధికారులను నిలదీస్తానని తెలిపారు.

రైతుల కుటుంబాలకు పరామర్శ

ప్రభుత్వ నిర్వాకం కారణంగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను అంతకుముందు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న బొలినేని కృష్ణారావు, నీలం వెంకట్రావ్ కుటుంబాలతోపాటు పొగాకు వేలం కేంద్రంలోనే గుండె ఆగి మరణించిన మిడసల కొండలరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం బాధిత రైతుల సమస్యలపై టంగుటూరులో నిరాహార దీక్ష చేపట్టారు.

First Published:  30 Sept 2015 10:40 AM IST
Next Story