వారాంతంలో విహారానికి టీ-టూరిజం ప్యాకేజ్
ఇక ప్రతి శని, ఆదివారాల్లో ఇంట్లో కాకుండా వినోద, విహార యాత్రలకు వెళ్ళాలనుకునేవారికి తెలంగాణ టూరిజం శాఖ ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలో రెండు రోజులపాటు పర్యటన ఉంటుంది. ఇందులో ఉండే టెంపుల్ టూరిజంలో భాగంగా పలు దేవస్థానాలను సందర్శించుకోవడంతోపాటు హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. కేవలం ఆలయాల దర్శనమే కాదు.. ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలను చూసే అవకాశం కల్పిస్తోంది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ. తెలంగాణ పర్యాటక […]
ఇక ప్రతి శని, ఆదివారాల్లో ఇంట్లో కాకుండా వినోద, విహార యాత్రలకు వెళ్ళాలనుకునేవారికి తెలంగాణ టూరిజం శాఖ ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలో రెండు రోజులపాటు పర్యటన ఉంటుంది. ఇందులో ఉండే టెంపుల్ టూరిజంలో భాగంగా పలు దేవస్థానాలను సందర్శించుకోవడంతోపాటు హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. కేవలం ఆలయాల దర్శనమే కాదు.. ప్రకృతి అందాలు.. చారిత్రక కట్టడాలను చూసే అవకాశం కల్పిస్తోంది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అక్టోబర్ 10 నుంచి ప్రారంభిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవాలయం, కొలనుపాక జైన దేవాలయం, పెంబర్తి చేతివృత్తుల కేంద్రం, వరంగల్ కోట, మలూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, మేడారం సమ్మక్క-సారలమ్మ, లక్నవరం, రామప్ప దేవాలయం సందర్శించవచ్చంటూ టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టినా జడ్ చొంగ్తు తెలిపారు.