Telugu Global
Others

కమ్మవారికి దూరమవుతున్న చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా చూసుకునే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబుపై కత్తులు దూయనుందా? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కాదనలేం! టిడిపి ఆవిర్భావం నుంచి మొన్న జరిగిన ఎన్నికల వరకు పార్టీ పటిష్టతకై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వారంతా ఒక్కటై పనిచేశారు. రాష్ట్రంలో  సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా ఆర్ధికంగా బలమైన వారు కావడంతో రాష్ట్ర రాజకీయాలను తామే శాసించగలమని నమ్మే ఈ వర్గం… తమకు అండగా ఉండే రాజకీయ పార్టీకే ఆర్ధిక అండదండలందించేవారు. తెలుగుదేశం […]

కమ్మవారికి దూరమవుతున్న చంద్రబాబు..!
X

naniతెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా చూసుకునే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబుపై కత్తులు దూయనుందా? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కాదనలేం! టిడిపి ఆవిర్భావం నుంచి మొన్న జరిగిన ఎన్నికల వరకు పార్టీ పటిష్టతకై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వారంతా ఒక్కటై పనిచేశారు. రాష్ట్రంలో సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నా ఆర్ధికంగా బలమైన వారు కావడంతో రాష్ట్ర రాజకీయాలను తామే శాసించగలమని నమ్మే ఈ వర్గం… తమకు అండగా ఉండే రాజకీయ పార్టీకే ఆర్ధిక అండదండలందించేవారు. తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడిన వారిలో ముందుగా చెప్పుకొనే వ్యక్తి రామోజీరావు. టిడిపిని నెలకొల్పింది ఎన్టీఆర్‌ అయినా… పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళింది మాత్రం రామోజీరావే. జగమెరిగిన సత్యం ఇది. అదేవిధంగా పార్టీకి ఆర్ధికంగా అండగా ఉన్న ఆంధ్రా బిర్లాగా పిలవబడే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్… పార్టీ కోసం మరోవిధంగా పాటుపడిన పరిటాల రవి… ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది కమ్మ కులస్థులు తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించేవారు. టిడిపి కోసం…. ఆ పార్టీ గెలుపు కోసం అహర్నిశం పని చేశారు.

చంద్రబాబునాయుడిలో మార్పు!

చంద్రబాబు గతంలో ఏనిర్ణయం తీసుకున్నా పార్టీ పెద్దలతోను… మేధావులతోను ఆలోచించేవాడని… కాని ఇప్పుడు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కమ్మ కులస్థుల ఆరోపణ. ఇపుడు కేవలం తన కోటరి ఏవిధంగా చేయమంటే ఆవిధంగా పని చేసి విమర్శల పాలవుతున్నాడని పార్టీ సానుభూతిపరులు బాధపడుతున్నారు. పార్టీ కోసం ముందు నుంచి సేవ చేస్తున్న తమని కాదని… లోకేష్ చెప్పిన వ్యక్తులుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం కమ్మ పెద్దలకు అసలు రుచించడం లేదు. ఉదాహరణకు టిడిపికి ఆర్ధిక సాయం చేస్తూ వస్తున్న ముళ్ళపూడి కుటుంబానికి టిటిడి పదవిని ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకోవడం … అలాగే అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను, ప్రభుత్వ ప్రకటనలను ఈటివికి కాకుండా మరొక ఛానెల్‌కి ఇచ్చి రామోజీ మీడియాని ప్రక్కకు పెట్టడం….పార్టీ కోసం ఎన్నోకష్టనష్టాలకు గురయిన కరణం బలరాంను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం …. పరిటాల రవి మృతికి కారణమయిన జెసి సోదరులకు పార్టీలో చంద్రబాబు పెద్దపీట వేయడం ఈ వర్గం జీర్ణించుకొలేకపోతోంది. ఇక చంద్రబాబును ఉపేక్షించరాదని తమ సత్తాను ఆయనకు చూపాలని కమ్మ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతంతో ఓ సమావేశం కూడా నిర్వహించుకున్నట్టు చెబుతున్నారు.

చంద్రబాబూ… జాగ్రత్త!

సినీరంగానికి టిడిపికి విడదీయరాని అనుబంధం ఉంది. సినీరంగానికి సంబంధించిన ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో టిడిపి ఎంపి మురళీమోహన్ వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. మురళీమోహన్ వర్గమంటే టిడిపి వర్గమే. సినీరంగంలో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నాగాని మురళీమోహన్ వర్గాన్ని ఓడించడం ద్వారా… కమ్మ కులస్తులు చంద్రబాబుకు దూరమవుతున్నారనే సంకేతాలిచ్చారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కరపత్రంగా చెప్పుకునే ఈనాడు దినపత్రికలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాల వెనుక కూడా ఈ సామాజికవర్గం హస్తం ఉందని చెబుతున్నారు. ఈనాడులో ఇసుకాసురులు అనే పెద్ద శీర్షికను చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు రామోజీరావు షాక్ ఇచ్చారు. ఈ షాక్ నుంచి చంద్రబాబునాయుడు తెరుకొక ముందే ఫిల్మిసిటిలో రామోజీరావు జగన్ తో సమావేశమయి రాజకీయ ప్రకంపనలకు తెర తీశాడు. కొంతమంది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు ఇప్పటికే బీజేపీలో తిష్ట వేసి ఉన్నారు. చంద్రబాబు కాదనుకుంటే తమకు ప్రత్యమ్నాయం ఏమిటన్న విషయంలో కూడా వారికి స్పష్టత ఉంది. కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్‌ వంటివారు ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వీరికెలాగూ చంద్రబాబును వద్దనుకుంటే రామోజీరావు అండగా ఉంటారన్న నమ్మకం ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే కమ్మ సామాజికవర్గం తమదైన రీతిలో పావులు కదుపుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఏవిధంగా మారనుందో ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబుకు గడ్డురోజులు తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

– సవరం నాని

First Published:  29 Sept 2015 6:15 AM IST
Next Story