Telugu Global
Others

తెలుగు రైతుల ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్‌

రెండు తెలుగు రాష్ర్టాల్లో సాగుతున్న రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే సరిపోతుందా అని హైకోర్టు ప్రశ్నించింది. అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వాలు అధ్యయనం చేశాయా అని ప్రశ్నించింది. ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశిస్తూ అసలు చర్యలు చేపట్టరా లేదా అని సూటిగా ప్రశ్నించింది. అక్టోబరు 13వ తేదీలోగా దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు […]

రెండు తెలుగు రాష్ర్టాల్లో సాగుతున్న రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే సరిపోతుందా అని హైకోర్టు ప్రశ్నించింది. అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వాలు అధ్యయనం చేశాయా అని ప్రశ్నించింది. ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశిస్తూ అసలు చర్యలు చేపట్టరా లేదా అని సూటిగా ప్రశ్నించింది. అక్టోబరు 13వ తేదీలోగా దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. అసలు ఆత్మహత్యల నివారణకు వ్యవసాయంపై స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేసేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ వ్యవసాయ జనచైతన్య సమితి తరఫున రామయ్యయాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆత్మహత్యలపై ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కౌంటర్‌లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

First Published:  28 Sept 2015 6:44 PM IST
Next Story