అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం
అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు వేసిన కేసులో అధికారుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ప్రత్యేక దర్వాప్తు సంస్థతో విచారణ జరపాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో అది జరగక పోవడం కోర్టు ఆగ్రహానికి కారణమైంది. ఈ కేసు దర్యాప్తు జరగవలసిన రీతిలో జరగడం లేదని, డిపాజిటర్లకు న్యాయం జరిగే విధంగా విచారణను నిర్వహించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని వేసి ఈ కేసును పరిష్కార దిశలో […]
అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు వేసిన కేసులో అధికారుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ప్రత్యేక దర్వాప్తు సంస్థతో విచారణ జరపాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో అది జరగక పోవడం కోర్టు ఆగ్రహానికి కారణమైంది. ఈ కేసు దర్యాప్తు జరగవలసిన రీతిలో జరగడం లేదని, డిపాజిటర్లకు న్యాయం జరిగే విధంగా విచారణను నిర్వహించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని వేసి ఈ కేసును పరిష్కార దిశలో విచారణ జరపాలని హైకోర్టు సూచించింది. దీనిపై ఏం చేస్తున్నారో… ఎలా చేస్తున్నారో రెండు రోజులలో నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు అధికారులను ఆదేశించింది. దర్యాప్తు ఇలాగే కొనసాగితే తమ జోక్యం పెరుగుతుందని హైచ్చరించింది. ఈ కేసుకు సంబంధించి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వం కూడా దీనిపై ఒక అధికారిక కమిటీని వేసింది. కాని దర్యాప్తు తీరే సరిగా లేనట్టు కోర్టు వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది.