కారు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ మూడులో మలుపు వద్ద గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈసంఘటనలో కారు ద్వంసం అయింది. అందులో ఉన్న నలుగురిలో ముగ్గురు మరణించగా, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటనే దగ్గరలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్దులని, ఉప్పల్ ప్రాంతానికి చెందిన స్వరూప్ […]
BY sarvi27 Sept 2015 8:36 PM IST
sarvi Updated On: 28 Sept 2015 6:17 AM IST
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ మూడులో మలుపు వద్ద గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈసంఘటనలో కారు ద్వంసం అయింది. అందులో ఉన్న నలుగురిలో ముగ్గురు మరణించగా, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటనే దగ్గరలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్దులని, ఉప్పల్ ప్రాంతానికి చెందిన స్వరూప్ నగర్ వాసులని పోలీసులు చెబుతున్నారు. శరత్ చంద్ర గౌడ్, తేజ, నరేన్ అనే వారు మరణించగా కార్తికేయరెడ్డి అనే విద్యార్ది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారులో సగం తాగిన మద్యం సీసా ఉండడంతో వారంతా తాగి ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తాగి వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదానికి గురై ఉంటారని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story