Telugu Global
NEWS

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. పార్టీ ఫిరాయించిన ఈ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు  వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశం స్పీకర్‌ పరిధిలో ఉన్న ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు చెబుతూ హైకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలో ఉంటూ బోగాలు అనుభవిస్తున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మూడు ప్రధాన పార్టీలు హైకోర్టులో […]

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట
X
వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. పార్టీ ఫిరాయించిన ఈ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశం స్పీకర్‌ పరిధిలో ఉన్న ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు చెబుతూ హైకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలో ఉంటూ బోగాలు అనుభవిస్తున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మూడు ప్రధాన పార్టీలు హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశాయి. ఎమ్మెల్యేల అనర్హత అంశం తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పరిధిలో ఉన్నందున తాము పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. అయితే ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా తాము స్పీకర్‌కు సూచిస్తామని హైకోర్టు వెల్లడించింది. దీనిపై తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ తాము ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
First Published:  28 Sept 2015 6:19 AM IST
Next Story