సోమ్‌నాథ్ లొంగిపో: సుప్రీం ఆదేశం
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిని సాయంత్రంలోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భార్య లిపికా మిత్రాను హింసించడం, హత్యాయత్నానికి పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఆయన తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని తిరస్కరించిన కోర్టు ముందుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు అంతకుముందే తిరస్కరించింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తుండటంతో సోమ్‌నాథ్ భారతి మారువేషంలో […]
BY sarvi28 Sept 2015 11:00 AM IST
X
sarvi Updated On: 28 Sept 2015 11:00 AM IST
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిని సాయంత్రంలోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భార్య లిపికా మిత్రాను హింసించడం, హత్యాయత్నానికి పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఆయన తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని తిరస్కరించిన కోర్టు ముందుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు అంతకుముందే తిరస్కరించింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నిస్తుండటంతో సోమ్‌నాథ్ భారతి మారువేషంలో తిరుగుతున్నారు. సోమ్‌నాథ్ భారతి మాజీ న్యాయశాఖా మంత్రి కూడా బాధ్యతలు నిర్వహించారు.
Next Story