Telugu Global
Others

బీజేపీకి ఓటేస్తే.. రిజ‌ర్వేష‌న్లు గోవిందా!

బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ఆదివారం ఖగారియా జిల్లా పర్బట్టా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఆయ‌న లేవ‌నెత్తారు. బీజేపీకి ఓటేస్తే..దేశంలో రిజ‌ర్వేష‌న్ల విధానానికి మంగ‌ళం పాడ‌తార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఉద‌హ‌రించారు. ఎంతైనా ఆర్ ఎస్ ఎస్ చెప్పిన‌ట్లు బీజేపీ వింటుంద‌ని, ఎన్‌డీఏ అనుబంధ పార్టీల‌కు ఓటేస్తే.. రిజ‌ర్వేష‌న్ల విధానానికి […]

బీజేపీకి ఓటేస్తే.. రిజ‌ర్వేష‌న్లు గోవిందా!
X
బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ఆదివారం ఖగారియా జిల్లా పర్బట్టా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఆయ‌న లేవ‌నెత్తారు. బీజేపీకి ఓటేస్తే..దేశంలో రిజ‌ర్వేష‌న్ల విధానానికి మంగ‌ళం పాడ‌తార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఉద‌హ‌రించారు. ఎంతైనా ఆర్ ఎస్ ఎస్ చెప్పిన‌ట్లు బీజేపీ వింటుంద‌ని, ఎన్‌డీఏ అనుబంధ పార్టీల‌కు ఓటేస్తే.. రిజ‌ర్వేష‌న్ల విధానానికి స్వ‌స్తి ప‌లుకుతార‌ని హెచ్చ‌రించారు. ఒకవేళ తమ కూటమి (జేడీయూ – ఆర్జేడీ – కాంగ్రెస్) అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. రాష్ర్టాభివృద్ధికి తాను ప్రకటించిన రూ.2.70 లక్షల కోట్ల విజన్‌ను అపహస్యం చేసిన ప్రధాని నరేంద్రమోదీపై నితీశ్ మండిపడ్డారు. పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని బీజేపీ ఎంపీ ఆర్కేసింగ్ చేసిన ఆరోపణ ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెడ్తున్నదని నితీశ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన కామెంట్లనే నితీశ్ కుమార్ ఎన్నిక‌ల ప్ర‌చార‌స‌భ‌ల్లో అస్త్రాలుగా మ‌లుచుకుంటున్నారు. దీనికితోడు ప‌టేల్ సామాజిక వ‌ర్గం త‌రపున పీఏఏఎస్ అధినేత హ‌ర్దిక్ ప‌టేల్ ఇచ్చిన బ‌హిరంగ మ‌ద్ద‌తుతో నితీశ్ గెలుపుపై ధీమాగా ఉన్నారు.
First Published:  28 Sept 2015 5:23 AM IST
Next Story