Telugu Global
Others

క్లీన్ చిట్- మసి అంటని మన్మోహన్

బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కొండంత ఊరట లభించింది.  బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్ ప్రాత  లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది.  బొగ్గు గనుల కేటాయింపు మొత్తం మన్మోహన్ కనుసన్నల్లోనే జరిగిందని కాబట్టి ఆయనకు సమన్లు జారీ చేయలంటూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ మాజీ ప్రధానికి అండగా నిలిచింది.  కుంభకోణంలో మన్మోహన్ పాత్ర లేదని స్పష్టం చేసింది.   మన్మోహన్‌ను నిందితుల జాబితాలో […]

క్లీన్ చిట్- మసి అంటని మన్మోహన్
X
బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కొండంత ఊరట లభించింది. బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్ ప్రాత లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. బొగ్గు గనుల కేటాయింపు మొత్తం మన్మోహన్ కనుసన్నల్లోనే జరిగిందని కాబట్టి ఆయనకు సమన్లు జారీ చేయలంటూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ మాజీ ప్రధానికి అండగా నిలిచింది. కుంభకోణంలో మన్మోహన్ పాత్ర లేదని స్పష్టం చేసింది. మన్మోహన్‌ను నిందితుల జాబితాలో చేర్చాలన్న మధుకోడా డిమాండ్‌ను ఇటీవల బొగ్గు గనుల శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణ కూడా సమర్థించారు. అయితే సీబీఐ మాత్రం మన్మోహన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేసింది.
కుంభకోణానికి కారణమైన బొగ్దు గనుల కేటాయింపులు జరిగిన సమయంలో దాసరి నారాయణ రావు కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఈ శాఖను పర్యవేక్షించేవారు.
First Published:  28 Sept 2015 3:33 PM IST
Next Story