రోజుకు ఐదుగురు బాలలు ఆదృశ్యం!
నేటి బాలలే రేపటి పౌరులు అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే భారతదేశంలో చిన్నారుల మనుగడ కష్టంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా పోలీసుల గణాంకాల ప్రకారం.. ప్రతిరోజు సగటున ఐదురుగు చిన్నారులు అదృశ్యమవుతున్నారు. ఢిల్లీలో చిన్నారులను అక్రమంగా రవాణా చేసే ముఠాలే బాలలను అపహరిస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. గత ఐదేండ్లలో ఇప్పటి వరకు 8,470 మంది పిల్లలు […]
నేటి బాలలే రేపటి పౌరులు అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే భారతదేశంలో చిన్నారుల మనుగడ కష్టంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా పోలీసుల గణాంకాల ప్రకారం.. ప్రతిరోజు సగటున ఐదురుగు చిన్నారులు అదృశ్యమవుతున్నారు. ఢిల్లీలో చిన్నారులను అక్రమంగా రవాణా చేసే ముఠాలే బాలలను అపహరిస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. గత ఐదేండ్లలో ఇప్పటి వరకు 8,470 మంది పిల్లలు అదృశ్యమైనట్లు ఢిల్లీ పోలీసుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదృశ్యమైన వారిలో 4,620 మంది బాలురుకాగా, 2,665 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 1,800 మందిని గుర్తించినట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. చిన్నారులను ఎత్తుకుపోయే ముఠాలు ముఖ్యంగా మురికివాడలపై దృష్టి పెడతాయి. గుడిసెల ముందు ఆడుకుంటున్న బాలలను గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకుపోతున్నారు. కొంతకాలంగా వీరి పంథా మారింది. స్కూలుకు వెళ్లి వస్తున్న చిన్నారులు, పర్యాటకుల పిల్లలు లక్ష్యంగా అపహరణలకు పాల్పడుతున్నారు. ఇలా ఎత్తుకెళ్లిన వారిలో బాలబాలికలను వివిధ కేంద్రాలకు విక్రయిస్తున్నారు. బాలురను వెట్టిచాకిరీకి నిలయాలైన పరిశ్రమలు, గోదాములకు అమ్మేస్తున్నారు. ఇక ఆడపిల్లలకు నేరుగా వ్యభిచార కూపంలో నెడుతున్నారు అని సీనియర్ పోలీసు అధికారి వివరించారు.