మా తండ్రి మరణం అనుమానాస్సదమే!
దేశగతిని ప్రభావితం చేసిన మహనీయుల మరణాలు దశాబ్దాల తర్వాత కొత్తకొత్త అనుమానాలతో తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన కీలక ఫైళ్లను బెంగాల్ సర్కార్ బయటపెట్టడంతో దేశంలో పెద్ద చర్చే జరుగుతోంది. బోస్ మరణానికి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న ఫైళ్లు బయటపెట్టాలన్న డిమాండ్ మరింత ఉధృతం అవుతోంది. తాజాగా… మాజీ ప్రధాని లాల్‌బహదుర్ శాస్త్రి మరణం తెరపైకి వచ్చింది. శాస్త్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి డిమాండ్ […]
దేశగతిని ప్రభావితం చేసిన మహనీయుల మరణాలు దశాబ్దాల తర్వాత కొత్తకొత్త అనుమానాలతో తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన కీలక ఫైళ్లను బెంగాల్ సర్కార్ బయటపెట్టడంతో దేశంలో పెద్ద చర్చే జరుగుతోంది. బోస్ మరణానికి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న ఫైళ్లు బయటపెట్టాలన్న డిమాండ్ మరింత ఉధృతం అవుతోంది. తాజాగా… మాజీ ప్రధాని లాల్‌బహదుర్ శాస్త్రి మరణం తెరపైకి వచ్చింది. శాస్త్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి డిమాండ్ చేశారు. విదేశాల నుంచి ప్రధాని తిరిగిరాగానే దీనిపై లేఖ కూడా రాస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి మరణంపై మొదటి నుంచి తమకు అనేక అనుమానాలున్నాయన్నారు. 1966 జనవరి 11న తాష్కెంట్‌లో శాస్త్రి కన్నుమూయగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చారు. తన తండ్రి మృతదేహాన్ని చూసి అప్పట్లో షాక్ అయ్యామని అనిల్ శాస్త్రి ఓ జాతీయ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శరీరం, ముఖభాగం నీలిరంగులోకి మారి ఉందని వివరించారు. అందుకే తన తండ్రిది సహజమరణం అంటే తాము నమ్మడం లేదని చెప్పారు. అసలు ఒక ప్రధాని బసచేస్తున్న రూమ్‌లో కాలింగ్ బెల్ లేదనడం, ప్రథమ చికిత్స కూడా అందకపోవడం బట్టి దీని వెనుక ఏవో తెలియని కారణాలు ఉన్నాయని అనిల్ శాస్త్రి అనుమానం వ్యక్తం చేశారు.
తన తండ్రికి వ్యక్తిగత పిజిఫియన్‌గా ఉన్న డాక్టర్ కూడా అనధికాలంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, వ్యక్తిగత సహాయకుడు కూడా అదే తీరులో ప్రమాదం జరగడాన్ని అనిల్ శాస్త్రి గుర్తుచేశారు. శాస్త్రికి సంబంధించిన ఎరుపురంగు డైరీ కూడా తష్కెంట్‌లో మాయమైపోయిందని వీటన్నింటిని బట్టి చూస్తే ఆయన మరణం వెనుక కుట్రదాగి ఉందనిపిస్తోందని అనిల్ శాస్త్రి అనుమానం వ్యక్తం చేశారు. 1966లో పాకిస్తాన్‌తో శాంతి ఒప్పందంపై చర్చించేందుకు శాస్త్రి ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ వెళ్లారు. అనుకున్నట్టుగానే జనవరి 10, 1966న ఒప్పందంపై శాస్త్రి, పాక్ అధ్యక్షుడు సంతకాలు చేశారు. ఇది జరిగిన కొన్నిగంటల్లోనే గుండెపోటుతో శాస్త్రి చనిపోయారని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.