Telugu Global
NEWS

ఇక‌పై అధికారికంగా కొండా లక్ష్మ‌ణ్ జ‌యంతి!

తెలంగాణ విముక్తికి, ప్ర‌త్యేక రాష్ర్ట సాధ‌న‌కు నిరంత‌రం కృషి చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జ‌యంతిని ఇక‌పై అధికారికంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. దీని ప్ర‌కారం కొండా జ‌యంతిని రాష్ర్ట వ్యాప్తంగా ఈనెల 28 (సోమ‌వారం)న ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌జీవో ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఉత్స‌వాల‌కు కావాల్సిన నిధుల‌ను బీసీ సంక్షేమ శాఖ నుంచి విడుద‌ల చేయ‌నున్నారు. ఒక్కోజిల్లాకు […]

ఇక‌పై అధికారికంగా కొండా లక్ష్మ‌ణ్ జ‌యంతి!
X
తెలంగాణ విముక్తికి, ప్ర‌త్యేక రాష్ర్ట సాధ‌న‌కు నిరంత‌రం కృషి చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జ‌యంతిని ఇక‌పై అధికారికంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. దీని ప్ర‌కారం కొండా జ‌యంతిని రాష్ర్ట వ్యాప్తంగా ఈనెల 28 (సోమ‌వారం)న ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌జీవో ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఉత్స‌వాల‌కు కావాల్సిన నిధుల‌ను బీసీ సంక్షేమ శాఖ నుంచి విడుద‌ల చేయ‌నున్నారు. ఒక్కోజిల్లాకు రూ.20 వేలు, రాజ‌ధానిలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి రూ.8 ల‌క్ష‌లు కేటాయించ‌నున్నారు. వాస్త‌వానికి కొండాల‌క్ష్మ‌ణ్ జయంతి (నేడు ఆయ‌న శ‌త జయంతి) ఆదివార‌మే అయినా వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా సోమ‌వారం నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కొండా ల‌క్ష్మ‌ణ్ జ‌యంతి ఉత్స‌వ క‌మిటీ ఛైర్మ‌న్‌గా మంత్రి జోగురామ‌న్న‌, వైస్ చైర్మ‌న్‌గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మ‌రోవైపు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పేరిట తపాలా బిళ్ల విడుద చేయాల‌న్న ఎంపీ రాపోలు లేఖ‌కు కేంద్ర మంత్రి ర‌వి శంక‌ర్ సానుకూలంగా స్పందించారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు, త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స‌మాధానం ఇచ్చారు.
First Published:  27 Sept 2015 4:44 AM IST
Next Story