Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 218

సూరజ్‌: అది ఏం కుక్క నీరజ్‌: అది పోలీస్‌ కుక్క సూరజ్: అలా అనిపించడం లేదే! నీరజ్: అది ‘సీక్రెట్‌ సర్వీసు’లో ఉందిలే! ————————————————————————————— విక్కి: నేను నా మనసు మార్చుకున్నాను. వినోద్: హమ్మయ్యా! కొత్తదయినా సరిగా పనిచేస్తోందా? లేదా? ————————————————————————————— టీచర్‌: రాధా: వందరూపాయలకు పది ఆపిల్‌పళ్ళు తెచ్చామనుకో! ఒక్కో ఆపిల్‌ ఖరీదు ఎంత? రాధ: ఆపిల్‌పళ్ళు మరీ అంత ఖరీదు లేవు టీచర్! ————————————————————————————— రఘు: ఈ నది చేపలు నివసించడానికి అనుకూలమైందా? గౌరవ్‌: […]

సూరజ్‌: అది ఏం కుక్క
నీరజ్‌: అది పోలీస్‌ కుక్క
సూరజ్: అలా అనిపించడం లేదే!
నీరజ్: అది ‘సీక్రెట్‌ సర్వీసు’లో ఉందిలే!
—————————————————————————————
విక్కి: నేను నా మనసు మార్చుకున్నాను.
వినోద్: హమ్మయ్యా! కొత్తదయినా సరిగా పనిచేస్తోందా? లేదా?
—————————————————————————————
టీచర్‌: రాధా: వందరూపాయలకు పది ఆపిల్‌పళ్ళు తెచ్చామనుకో! ఒక్కో ఆపిల్‌ ఖరీదు ఎంత?
రాధ: ఆపిల్‌పళ్ళు మరీ అంత ఖరీదు లేవు టీచర్!
—————————————————————————————
రఘు: ఈ నది చేపలు నివసించడానికి అనుకూలమైందా?
గౌరవ్‌: అనుకూలమైందిగానే అనుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళనించీ చూస్తున్నాను కదా ఒక్క చేపా బైటికి వచ్చిన పాపాన పోలేదు.

First Published:  26 Sept 2015 6:33 PM IST
Next Story