భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే
మోడీ సారధ్యంలో జపాన్, జర్మనీ, బ్రెజిల్ డిమాండ్ ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని భారత ప్రధాని నరేంద్రమోడీ డిమాండ్‌చేశారు. నిర్దిష్ట గడువు విధించుకొని భద్రతామండలిలో సంస్కరణలను వెంటనే చేపట్టాలని సూచించారు. ఐరాస ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయని, కానీ ఆ సంస్థ వాటికి అనుగుణంగా మారలేదని అన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌తో కూడిన జీ-4 కూటమి దేశాధినేతల సమావేశంలో […]
మోడీ సారధ్యంలో జపాన్, జర్మనీ, బ్రెజిల్ డిమాండ్
ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని భారత ప్రధాని నరేంద్రమోడీ డిమాండ్‌చేశారు. నిర్దిష్ట గడువు విధించుకొని భద్రతామండలిలో సంస్కరణలను వెంటనే చేపట్టాలని సూచించారు. ఐరాస ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయని, కానీ ఆ సంస్థ వాటికి అనుగుణంగా మారలేదని అన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌తో కూడిన జీ-4 కూటమి దేశాధినేతల సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పరస్పరం సహరించుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన ఈ కూటమి సమావేశంలో జపాన్ ప్రధాని షింజోఅబే, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మారోసెఫ్‌తో ఐరాస సంస్కరణలపై మోడీ విస్తృతంగా చర్చించారు. అనంతరం నలుగురు నేతలు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు తమకు సంపూర్ణ అర్హతలు ఉన్నాయని భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ ఈ ప్రకటనలో స్పష్టం చేశాయి.