యేడాదిలోగా 25 నియోజకవర్గాలకు మంచినీరు: కేటీఆర్
ప్రతిష్ఠాత్మక వాటర్‌గ్రిడ్ ద్వారా ఏడాదిలోపలే 25 నియోజకవర్గాల్లో ఇంటింటికీ మంచినీరందిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ మేరకు లక్ష్యం నిర్దేశించుకుని ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిని శాసనసభ్యులకు వివరిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బుక్‌లెట్లు అందచేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. వాటర్‌గ్రిడ్ పనులలో పాల్గొంటున్న అధికారులకు ఆన్‌లైన్ పైప్‌లైన్ మేనేజ్ మెంట్ సాఫ్ట్‌వేర్ అనే అంశంపై వ్యాప్కోస్ లిమిటెడ్ శిక్షణ […]
BY sarvi26 Sept 2015 6:35 PM IST
sarvi Updated On: 27 Sept 2015 7:27 AM IST
ప్రతిష్ఠాత్మక వాటర్‌గ్రిడ్ ద్వారా ఏడాదిలోపలే 25 నియోజకవర్గాల్లో ఇంటింటికీ మంచినీరందిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ మేరకు లక్ష్యం నిర్దేశించుకుని ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిని శాసనసభ్యులకు వివరిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బుక్‌లెట్లు అందచేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. వాటర్‌గ్రిడ్ పనులలో పాల్గొంటున్న అధికారులకు ఆన్‌లైన్ పైప్‌లైన్ మేనేజ్ మెంట్ సాఫ్ట్‌వేర్ అనే అంశంపై వ్యాప్కోస్ లిమిటెడ్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
Next Story