బాబుకు బినామీ ఆస్తులే ఎక్కువ: చెవిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, టిడిపి యువనేత లోకేష్ వారి కుటుంబానికి సంబందించిన ఆస్తుల ప్రకటన అంతా బూటకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. తాను చిత్తూరు జిల్లాకు చెందినవాడినని, అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వాడినని, తనకు ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసునని అన్నారు. చంద్రబాబు తన ఆస్తులను బందువులు, మిత్రుల పేరుతో ఉంచారని, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను కూడా వెల్లడిస్తే అపుడు జనం నమ్ముతారని అన్నారు. ఆస్తులను […]
BY sarvi27 Sept 2015 6:38 AM IST
X
sarvi Updated On: 27 Sept 2015 12:00 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, టిడిపి యువనేత లోకేష్ వారి కుటుంబానికి సంబందించిన ఆస్తుల ప్రకటన అంతా బూటకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. తాను చిత్తూరు జిల్లాకు చెందినవాడినని, అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి వాడినని, తనకు ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసునని అన్నారు. చంద్రబాబు తన ఆస్తులను బందువులు, మిత్రుల పేరుతో ఉంచారని, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను కూడా వెల్లడిస్తే అపుడు జనం నమ్ముతారని అన్నారు. ఆస్తులను కొన్నప్పటి విలువనే చెబితే చాలామంది కోటీశ్వరులు లక్షాధికారులగానే మిగులుతారని ఆయన అన్నారు. చంద్రబాబుకు కేవలం 43 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయంటే నమ్మడానికి ప్రజలు దద్దమ్మలు కారని చెవిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో రుజువు చేయడానికి తాను సిద్దమని, ఈ విషయమై ఎక్కడికైనా వస్తానని ఆయన సవాలు విసిరారు.
Next Story