Telugu Global
Others

సుబ్రమణ్యస్వామికి వీసీ పదవి అసాధ్యం: స్మృతి

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పదవి కట్టబెడతారనే ఊహాగానాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెర దించారు. వయసు రిత్యా వీసీ పదవికి ఆయన అనర్హులని తేల్చి చెప్పారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. వీసీ పదవి కోసం స్వామిని తన శాఖ సిఫార్సు చేయలేదని స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలను బీజేపీ కాషాయమయం […]

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పదవి కట్టబెడతారనే ఊహాగానాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెర దించారు. వయసు రిత్యా వీసీ పదవికి ఆయన అనర్హులని తేల్చి చెప్పారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. వీసీ పదవి కోసం స్వామిని తన శాఖ సిఫార్సు చేయలేదని స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలను బీజేపీ కాషాయమయం చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో స్మృతీ ఇరానీ ఈ వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

First Published:  25 Sept 2015 1:11 PM GMT
Next Story