ఏపీలో ఆర్టీసి బాదుడుకు రంగం సిద్ధం
రెండు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని, ఇంధనం ధరలు పెరుగుతున్నా భరిస్తూనే ప్రయాణికులపై భారం వేయలేదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను పెంచాలని భావిస్తున్నామని, డీజిల్ ధరలు పరిమితంగానే తగ్గుతున్నందున చార్జీలను పెంచడం అనివార్యంగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనలను సీఎం, రవాణశాఖ మంత్రికి అందించామని ఆయన పేర్కొన్నారు. గుంటూరులోని ఆర్టీసీ బస్టాండులో ఎండీ సాంబశివరావు తనిఖీలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ […]
BY sarvi26 Sept 2015 6:02 AM GMT
X
sarvi Updated On: 26 Sept 2015 9:30 AM GMT
రెండు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని, ఇంధనం ధరలు పెరుగుతున్నా భరిస్తూనే ప్రయాణికులపై భారం వేయలేదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను పెంచాలని భావిస్తున్నామని, డీజిల్ ధరలు పరిమితంగానే తగ్గుతున్నందున చార్జీలను పెంచడం అనివార్యంగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనలను సీఎం, రవాణశాఖ మంత్రికి అందించామని ఆయన పేర్కొన్నారు. గుంటూరులోని ఆర్టీసీ బస్టాండులో ఎండీ సాంబశివరావు తనిఖీలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్ణయం మేరకే ఆర్టీసీ చార్జీలు పెంచుతామన్నారు. గుంటూరులో రద్దీ ఎక్కువైతే టెర్మినల్ బస్గాండు నిర్మిస్తామన్నారు.
Next Story