Telugu Global
National

మోడీ గారూ... జెండానా? జేబు రుమాలా?

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఎప్పుడూ వివాదాస్పదంగా వుంటుంది.  దానికి తోడు ఆయన యథాలాపంగా చేసే కొన్ని పనులు విమర్శలకు దారి తీస్తుంటాయి.  ఎవరైనా అడిగితే జేబు రుమాలుపై సంతకం చేసి ఇచ్చినట్లు మోడీ కూడా ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు జాతీయ పతాకంపై ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు.  ఆ పతాకాన్ని సోమవారం అమెరికా అధ్యక్షుడు ఒబామాకు కానుకగా ఇవ్వవలసిందిగా  మోడీ చెఫ్ ను కోరారట.  ఇప్పుడు ఆ కానుక సోషల్ మీడియాలో వివాదం రేపుతోంది.  […]

మోడీ గారూ... జెండానా? జేబు రుమాలా?
X
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఎప్పుడూ వివాదాస్పదంగా వుంటుంది. దానికి తోడు ఆయన యథాలాపంగా చేసే కొన్ని పనులు విమర్శలకు దారి తీస్తుంటాయి. ఎవరైనా అడిగితే జేబు రుమాలుపై సంతకం చేసి ఇచ్చినట్లు మోడీ కూడా ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు జాతీయ పతాకంపై ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు. ఆ పతాకాన్ని సోమవారం అమెరికా అధ్యక్షుడు ఒబామాకు కానుకగా ఇవ్వవలసిందిగా మోడీ చెఫ్ ను కోరారట. ఇప్పుడు ఆ కానుక సోషల్ మీడియాలో వివాదం రేపుతోంది.
అసలు జరిగిందేమంటే అమెరికా పర్యటన‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ ఎగ్జిక్యూటీవ్‌లకు విందు ఇచ్చారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా రకరకాల వంటకాలు చేసి అతిధులకు వడ్డించారు. వికాస్ ఖన్నా కూతురు మానసిక వికలాంగురాలు. ఆ బాలిక ఒక జెండాను తయారు చేసి ఇచ్చింది. చెఫ్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ బాలిక పట్ల సానుభూతితో మోడీ జెండా పై సంతకం చేసారని జాతీయ జెండాను అవమానించాలన్న ఉద్దేశంతో కాదని ప్రభుత్వ అధికార ప్రతినిధి వివరించారు. అయితే ఇది ముమ్మాటికీ జాతీయ పతాకాన్ని అగౌరవపరచడమేనని కాంగ్రెస్ పార్టీ దుమ్మెతి పోస్తోంది. 2002లో రూపొందించిన ఫ్లాగ్ కోడ్ ప్రకారం జాతీయ జెండాపై రాయడం చట్ట వ్యతిరేకం. అందువల్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రధాని మోడి చర్యను తప్పుపట్టారు.
First Published:  26 Sept 2015 8:34 AM IST
Next Story