Telugu Global
National

గనులు భోంచేశారు !

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంవత్సరం హనీమూన్ వలె గడచి పోయింది. రెండో సంవత్సరంనుంచి కష్టాలు మొదలయ్యాయి. అది కూడా కట్ట కట్టుకొని వచ్చాయి.  ముఖ్యంగా బిజెపి లోని నారీ జనం పైన ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.  వారిని రక్షించుకోవడం కోసం అధికార ఎన్ డి ఏ ప్రభుత్వం బిల్లులను కూడా పణంగా పెట్టాల్సి వచ్చింది.  మిత్రుడు లలిత మోడీకి సహాయం చేయడం పేరిట రాజస్థాన్ ముఖ్య మంత్రి వసుంధర రాజే తన వ్యాపార […]

గనులు భోంచేశారు !
X

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంవత్సరం హనీమూన్ వలె గడచి పోయింది. రెండో సంవత్సరంనుంచి కష్టాలు మొదలయ్యాయి. అది కూడా కట్ట కట్టుకొని వచ్చాయి. ముఖ్యంగా బిజెపి లోని నారీ జనం పైన ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. వారిని రక్షించుకోవడం కోసం అధికార ఎన్ డి ఏ ప్రభుత్వం బిల్లులను కూడా పణంగా పెట్టాల్సి వచ్చింది. మిత్రుడు లలిత మోడీకి సహాయం చేయడం పేరిట రాజస్థాన్ ముఖ్య మంత్రి వసుంధర రాజే తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా వసుంధర చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటున్నది. గతవారం రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన కొందరు ఐఏఎస్ అధికారులను అరెస్ట్ చేయడంతో కందిరీగల తుట్టెను కదిలించినట్లయ్యింది. దాదాపు 45 కోట్ల విలువైన గనులను ఇష్టం వచ్చినట్లు ధారాదత్తం చేసారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ గనులను వేలం వేయకుండా ‘మొదట వచ్చిన వారికి కేటాయింపు’ ప్రాతిపదికన 653 గనులను, వాటి చుట్టూత వున్న లక్ష భిగాల భూములను కూడా పంచిపెట్టారని కాంగ్రెస్ విరుచుకుపడింది. ముఖ్యమంత్రి వసుంధర రాజే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ డిమాండ్ చేసారు. తాము ప్రతిపాదించిన భూ సేకరణ బిల్లుకు కాంగ్రెస్ అడ్డుపడిందనే సాకుతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో భూ బాగోతాలను వెలికి తీయాలని బిజెపి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు రావడమే తరువాయి కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగడం ఎత్తుకు పై ఎత్తు వేసినట్లయింది.

First Published:  26 Sept 2015 2:27 AM GMT
Next Story