Telugu Global
National

ఢిల్లీ గవర్నర్‌కు కేజ్రీవాల్‌ సపోర్ట్‌!

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ను తొలగించాలన్న కాంగ్రెస్‌, బీజేపీ డిమాండును ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తప్పుపట్టారు. ఆయన నిమిత్త మాత్రుడని, కేవలం పిఎంఓ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారని, స్వతహాగా నజీబ్‌ మంచి వ్యక్తని కితాబిచ్చారు. నిజానికి ఓ నెలరోజులు వెనక్కి వెళ్ళి చూస్తే నజీబ్‌జంగ్‌ని విమర్శించే ఏకైక నేతగా కేజ్రీవాల్‌ కనిపిస్తారు. కాని ఇపుడు ఆయన అకస్మాత్తుగా మాట మార్చారు. కమిషనర్‌ నియామకం, ఏసీబీ, సీఎన్‌జీ స్కాంపై దర్యాప్తు తదితర అంశాలపై నజీబ్‌పై కేజ్రీవాల్‌ ఒంటికాలిపై […]

ఢిల్లీ గవర్నర్‌కు కేజ్రీవాల్‌ సపోర్ట్‌!
X
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ను తొలగించాలన్న కాంగ్రెస్‌, బీజేపీ డిమాండును ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తప్పుపట్టారు. ఆయన నిమిత్త మాత్రుడని, కేవలం పిఎంఓ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారని, స్వతహాగా నజీబ్‌ మంచి వ్యక్తని కితాబిచ్చారు. నిజానికి ఓ నెలరోజులు వెనక్కి వెళ్ళి చూస్తే నజీబ్‌జంగ్‌ని విమర్శించే ఏకైక నేతగా కేజ్రీవాల్‌ కనిపిస్తారు. కాని ఇపుడు ఆయన అకస్మాత్తుగా మాట మార్చారు. కమిషనర్‌ నియామకం, ఏసీబీ, సీఎన్‌జీ స్కాంపై దర్యాప్తు తదితర అంశాలపై నజీబ్‌పై కేజ్రీవాల్‌ ఒంటికాలిపై లేచి విమర్శలు గుప్పించారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇపుడు తన వైఖరి మార్చుకున్నారు. పైగా కాంగ్రెస్‌, బీజేపీలనే ఆయనపై ఫిర్యాదు చేసినందుకు తప్పుపడుతున్నారు. నజీబ్‌ జంగ్‌ను తొలగించాలన్న వారి డిమాండును తోసిపుచ్చుతూ గవర్నర్‌గా మరొకరు వచ్చినా వ్యవహారశైలి ఇలాగే ఉంటుందని ఆయన జంగ్‌ను సమర్ధించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ మార్పుకు కారణం ఏమిటో?
First Published:  26 Sept 2015 5:32 AM GMT
Next Story